మ‌న దేశంలో స్ట్రీట్ పుడ్ చాలా ఫేమ‌స్ అనే చెప్పాలి. ఖ‌రీదైన రెస్టారెంట్స్‌లో క‌న్నా స్ట్రీట్ పుడ్ చాలా టేస్టీగా ఉంటుంద‌ని అనే వారు చాలా మందే ఉంటారు. ఇక ఈ స్ట్రీట్ పుడ్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో వైర‌టీతో త‌యారు చేస్తుంటారు. మ‌నం ఎక్కువ‌గా వంట కోసం నూనెను వాడుతాం. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నూనె, నీళ్లు ఉప‌యోగించ‌కుండా ఇసుక‌లో వేయించ‌డం ద్వారా త‌యారైన ఓ వంట‌కం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఉత్తర్​ ప్రదేశ్​ రాష్ట్రంలో మైన్​పూరిలో భోలా బజార్​లో ఓ స్ట్రీట్​ వెండర్​ ఈ వంటకం చేస్తున్నారు.

ఈ వంట‌కం పేరు భూనా ఆలు. క‌ట్టెల బ‌ట్టీపై క‌డాయి పెట్టి అందులో ఇసుక పోసి బాగా వేడి చేస్తాడు. అందులో ఆలుగ‌డ్డ‌ల‌ను ఉంచి మ‌రో 20 నిమిషాల పాటు వేయిస్తాడు. అనంత‌రం వాటిని ఓ బుట్ట‌లో వేసి ఊపుతాడు. దీంతో ఆలు పొట్టు పోతుంది. అనంత‌రం మసాల, చట్నీతో వేడివేడిగా వడ్డిస్తారు. అత‌డు ఇలా 7 సంవ‌త్స‌రాలుగా అందిస్తున్నాడు. దీని ధ‌ర కేవ‌లం కేవ‌లం రూ.25 మాత్ర‌మే. ప్ర‌స్తుతం ఈ వంటకానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


తోట‌ వంశీ కుమార్‌

Next Story