ఫ‌స్ట్‌నైట్ రోజున పక్కింట్లో దాక్కున్న వ‌రుడు.. కార‌ణం తెలిసి కంగుతిన్న వ‌ధువు..!

The Groom hiding in the neighbor house on the day of the first night.కొత్త‌గా పెళ్లైన జంట తొలి రేయి కోసం ఎంతో ఆస‌క్తిగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2023 4:18 AM GMT
ఫ‌స్ట్‌నైట్ రోజున పక్కింట్లో దాక్కున్న వ‌రుడు.. కార‌ణం తెలిసి కంగుతిన్న వ‌ధువు..!

కొత్త‌గా పెళ్లైన జంట తొలి రేయి కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. తొలి రాత్రి ఎలా ఉంటుందోన‌న్న‌ కుతూహ‌లం, ఆందోళ‌న వారిలో ఉండ‌డం స‌హ‌జం. అయితే.. ఓ యువ‌కుడు మాత్రం తొలి రాత్రి గ‌దిలోకి వెళ్ల‌కుండా ఎటో వెళ్లిపోయాడు. కుటుంబ స‌భ్యులు ఎంత వెదికినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. అత‌డు పొరుగింటిలో దాక్కుకున్నాడు. అస‌లు అత‌డు ఎందుకు అలా చేశాడు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే...?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక దిన‌ప‌త్రిక ఈ వార్త‌ను ప్ర‌చురించింది. ఆ వార్తా సారంశం.. "ఒక వరుడు హనీమూన్ రాత్రి తన ఇంటి నుండి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. వరుడు ఎక్కడికి వెళ్లాడోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెంది రాత్రంతా వెతికారు. అయితే.. అతను పొరుగువారి ఇంట్లో దాక్కున్నాడు. మ‌రుస‌టి రోజు ఉద‌యం అతను తన మొబైల్ ఫోన్‌ను ఆన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు అతనిని సంప్రదించారు. అత‌డు ఎందుకు అలా చేశాడ‌ని అడుగ‌గా.. సిగ్గుగా ఉంద‌ని, రాత్రంతా ధైర్యం చేయలేక ఇబ్బందిపడ్డానని చెప్పాడ‌ట‌." విష‌యం విన్న వ‌ధువు న‌వ్వాలో ఏడ‌వాలో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది.

ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే.. ఈ మ్యాగజైన్ పేజీలను కొందరు మీమ్స్ కోసం ఇలా ఫోటోషాప్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తను కామెడీగానే పరిగణిస్తున్నారు.

Next Story