వైరల్ అవుతోన్నటీచర్ల లీవ్ లెటర్స్.. మా అమ్మ 5న చనిపోతాది సెలవు కావాలి
Teachers Come Up With Lame Excuses For Casual Leave.బీహార్ రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయులు సెలవుల కోసం రాసిన
By తోట వంశీ కుమార్ Published on 3 Dec 2022 10:50 AM ISTబీహార్ రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయులు సెలవుల కోసం రాసిన లీవ్ లెటర్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మా అమ్మ ఫలానా తేదీన చనిపోతుందని తరువాతి రెండు రోజులు సెలవులు కావాలని ఓ ఉఫాధ్యాయుడు రాయగా, నాలుగు రోజుల తరువాత నా ఆరోగ్యం పాడుఅవుతుంది అంటూ ఇంకో టీచర్.. ఇలా వింత వింత రీజన్లు చెప్పి సెలవులు అడుగుతున్నారు. అయితే.. వీరంతా ఇలా చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వులే కారణమని అంటున్నారు. క్యాజువల్ లీవ్ కోసం ఉపాధ్యాయులు మూడు రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ముంగేర్, భాగల్పూర్, బంకా జిల్లాల్లో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లేని పక్షంలో వారి సెలవులు స్వీకరించబడవని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఉఫాధ్యాయులు ఇలా వింత లీవ్ లెటర్‌లు రాస్తున్నారు.
- బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉఫాద్యాయుడు పాఠశాల ప్రిన్సిపాల్‌కు సెలవుల కోసం ఇలా లీవ్ లెటర్ రాశాడు. 'మా అమ్మ ఈ నెల 5వ తేదీ (డిసెంబర్ 6) రాత్రి 8 గంటలకు చనిపోతారు. అమ్మ అంత్యక్రియల కోసం 6, 7 తేదీల్లో సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి' అని రాశాడు.
- కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ అనే టీచర్.. 'నేను పెళ్లికి వెళ్లాలి. అక్కడ బాగా భోజనం చేస్తాను. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 7న పెలవు ఇవ్వండి అని ప్రిన్సిపల్‌ను కోరారు.
- బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ టీచర్ రాజ్‌గౌరవ్.. త్వరలో తనకు ఆరోగ్యం పాడవ్వనుందని ఓ లేఖ రాశారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో తనకు సెలవు కావాలని కోరారు.
ప్రస్తుతం ఈ లీవ్ లెటర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story