అఘోరీని పెళ్లాడిన అఘోరా
Tamilnadu Aghora Manikandan Marriage With Aghori.సాధారణంగా అఘోరా పేరు చెబితే మనలో చాలా మందికి ఆశ్చర్యంతో
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2021 3:16 PM ISTసాధారణంగా అఘోరా పేరు చెబితే మనలో చాలా మందికి ఆశ్చర్యంతో పాటు భయం కలగడం సహజం. దీనికి కారణంగా వారి విధి విధానాలే. పురాతన కాలం నుంచి వీరి గురించి ఓ ప్రచారం ఉంది. వీరికి కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయని చెబుతుంటారు. అఘోరాల్లో కొందరు నగ్నంగా, మరికొందరు చిన్న గుడ్డముక్క కట్టుకుని కనిపిస్తుంటారు. బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవడం, మానవ మృతదేహాలను తినడం లాంటి విపరీత చర్యలు చేస్తుండడంతో వీరు అంటేనే తెలియని భయం ఉంటుంది. వీరు మానవ శరీరం తుచ్ఛమైనదిగా భావిస్తారు. మనకు తెలిసినంత వరకు వీరు పెళ్లి చేసుకోరు. అయితే తాజాగా ఓ అఘోరా తన శిష్యురాలిగా ఉన్న అఘోరీని పెళ్లి చేసుకున్నాడు.
తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని అరియమంగళాని చెందిన మణికందన్ అనే వ్యక్తి కాశీలో అఘోర ఉపాసన చేసి అఘోరాగా మారాడు. అనంతరం స్వగ్రామానికి వచ్చి జై అఘోర కాళీమాత విగ్రహాన్ని నిర్మించాడు. అఘోర ఉపాసనపై ఇష్టం ఉన్న వారికి శిక్షణ ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన ప్రియాంక 8 ఏళ్లుగా ఇతడి దగ్గర శిష్యరికం చేస్తుంది. కాగా.. ఈ నెల 22న ఉదయం అఘోరా మణికందన్, అఘోరీ ప్రియాంకను హిందూ సంప్రదాయం ప్రకారం తాలికట్టి వివాహం చేసుకున్నాడు.
కాగా.. పెళ్లికి ముందు తరువాత యజ్ఞాలు చేశారు. అఘోరా మణికందన్ వివాహ వేడుకల తోటి అఘోరాలు, అఘోరీలు నాట్యం చేస్తూ, శంకం, డమరుకం వాయించారు. కాగా.. మణికందన్ గతంలో తన తల్లి చనిపోయినప్పుడు.. ఆమెపై శవంపై కూర్చొని అఘోరా సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించాడు. అప్పట్లో ఈ వార్త వైరల్‌గా మారింది.