కుమారై రూమ్‌లోకి వెళ్లిన తల్లికి షాక్.. వీడియో వైరల్
Sydney woman finds multiple spiders in daughter's room.తన కుమారై రూమ్‌ను శుభ్రం చేద్దామని లోనికి వెళ్లింది ఓ మహిళ.
By తోట వంశీ కుమార్
తన కుమారై రూమ్‌ను శుభ్రం చేద్దామని లోనికి వెళ్లింది ఓ మహిళ. ఆ రూమ్‌లో ఉన్న వాటిని చూసి షాక్‌కు గురైంది. ఆ తరువాత తేరుకుని తన స్నేహితులి రాలి సాయంతో.. ఆ రూమ్‌లోని గోడకు ఓ మూలలో వందల సంఖ్యలో ఉన్న సాలె పురుగు(స్పైడర్)లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని సిడ్నినగరంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది.
So, for everyone saying it's Photoshopped, here is her actual video. pic.twitter.com/2Zcro0nra7
— 💧 Petie R 🇦🇺🌟🦄🌱🌈🌏 (@PrinPeta) January 28, 2021
పిటీఆర్ అనే మహిళ ట్విట్టర్‌లో షేర్ చేసిన దాని ప్రకారం.. ఆమె స్నేహితులు.. తన కుమారై రూమ్‌ను శుభ్రం చేద్దామని ఆమె గదిలోకి వెళ్లింది. గోడవైపు చూడగా.. మూలల్లో వందల సంఖ్యలో సాలె పురుగులు కనిపించాయి. వాటి సైజు అరచేయి అంతంత ఉన్నాయి. పైగా అవి సాధారణ పాలె పురుగులు కాదు. 'హంట్స్‌మన్' సాలెపురుగులు. ఇవి భారీ ఆకారంలో ఉండే విషపూరితమైనవి. ఇవి కరిస్తే..వికారం, తలనొప్పి, వాంతులు అవుతాయి. పల్స్ రేట్ కూడా పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా కలుగుతుంది. వాటిని చూడగానే ఆమెకు ఆశ్చర్యం వేసి తన స్నేహితురాలిని పిలిచింది. అసలు ఇంట్లోకి ఇన్ని సాలె పురుగులు ఎలా వచ్చాయా అనుకుంటూ వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేయడంతో పాటు.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీటిని చూసిన నెటీజన్లలో కొందరు ఫోటో షాప్ అని కామెంట్లు చేశారు. దీంతో సదరు మహిళ అందుకు సంబందించిన వీడియోను సైతం పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.