వైర‌ల్‌.. 'న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు'

Student wrote pass it otherwise the father will get married.కొంచెం శ్ర‌ద్ద పెట్టి చ‌దివితే.. ప‌రీక్ష‌ల్లో ఎలాంటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2022 1:22 PM IST
వైర‌ల్‌.. న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు

కొంచెం శ్ర‌ద్ద పెట్టి చ‌దివితే.. ప‌రీక్ష‌ల్లో ఎలాంటి ప్ర‌శ్న‌లు ఇచ్చినా సుల‌భంగా స‌మాధానాలు రాయ‌వ‌చ్చు. అయితే.. కొంద‌రు విద్యార్థులు మాత్రం ఇచ్చిన ప్ర‌శ‌ల‌కు స‌మాధానాలు రాయ‌కుండా త‌మ‌కు న‌చ్చింది ఏదో ఒక‌టి రాస్తూ ఉంటారు. ఇంకొంద‌రు మాత్రం స‌మాధానాలు రాయ‌కుండా త‌మ‌ని పాస్ చేయ‌మ‌ని స‌మాధాన ప‌త్రాల్లో రాసుండ‌డాన్ని అప్పుడ‌ప్పుడూ మ‌నం చూస్తూనే ఉన్నాం. కొంద‌రు విద్యార్థులు అయితే.. త‌మ‌ని పాస్ చేయ‌కుంటే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డుతామ‌ని బెదిరిస్తుంటారు.

తాజాగా హ‌ర్యానా రాష్ట్రంలో జ‌రుగుతున్న బోర్డు ప‌రీక్ష‌ల్లో ఓ విద్యార్థిని రాసిన మ్యాట‌ర్ చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. త‌న‌ తండ్రి బాగా తాగుతాడ‌ని, సవతి తల్లి చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గుర‌వుతున్నాన‌ని ఓ విద్యార్థిని జ‌వాబు ప‌త్రంలో రాసింది. త‌న‌కు ఆర్మీలో ఉద్యోగం చేయాల‌ని ఉంద‌ని, అయితే.. ఈ పరీక్షల్లో 75 శాతం మార్కులు రాకపోతే త‌న తండ్రి త‌న‌కు పెళ్లి చేస్తానని చెప్పాడ‌ని అందులో పేర్కొంది. త‌న‌ను కూతురిలా బావించి పాస్ చేయాల‌ని కోరింది. దీన్ని చూసిన ఉపాధ్యాయుడుకి ఏం చేయాలో పాలుపోక ఉన్నాతాధికారుల దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకువెళ్ల‌డంతో ఈ న్యూస్ వైర‌ల్‌గా మారింది.

ఇక మ‌రో విద్యార్థి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదని, దయచేసి పాస్ మార్కులు వేయాల‌ని పేర్కొన్నాడు. తాను మంచి విద్యార్థిని అని రాశాడు. కాగా.. దీనిపై విద్యాశాఖాధికారి దయానంద్ సింగ్ స్పందించారు. కొంద‌రు విద్యార్థులు జ‌వాబు ప‌త్రాల‌పై ఇటువంటి రాత‌లు రాస్తున్నార‌ని, ప‌రీక్ష‌ల్లో ఇటువంటివి రాయకూడదని టీచ‌ర్లు తరగతి గదిలోనే విద్యార్థుల‌కు చెప్పాల‌న్నారు.

కాగా.. ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు జ‌వాబు ప‌త్రాల్లో ఇటువంటి వాటినే రాయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Next Story