షూట్‌లో చేదు అనుభవం.. పాప్ సింగర్‌ను కాటేసిన పాము
Singer Maeta bitten by snake while shooting music video.సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో ఏం చేసినా
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2021 2:49 PM ISTసోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో ఏం చేసినా దాదాపుగా వైరల్‌గా మారుతోంది. పాములు, కొండచిలువలకు పట్టుకుని ఫోటోలు దిగడం, వాటితో ఆడుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఓ మోడల్ పాములతో వీడియో షూట్ చేస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. పాము గాయని ముఖంపై కాటు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళ్లితే.. అమెరికాలోని జేజెడ్ లేబుల్ రోక్ నేషన్ అనే సంస్థ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్ వీడియో ని ప్లాన్ చేసింది. సింగర్ నేలపై పడుకుని పాములను ఒంటిమీద వేసుకుంటూ పాటలు పాడాలి ఇదీ కాన్సెఫ్ట్. అందుకు తగ్గట్లుగానే ఆమె బ్లాక్ కలర్ దుస్తులు ధరించి కార్పెట్‌పై పడుతోంది. ఆమె చుట్టూ పాములను వేశారు. కొన్ని పాములను ఆమె ఒంటిపై వేసుకుని పాటను పాడడం ప్రారంభించింది.
ఇంతలో ఓ పాము సడెన్ సింగర్ గదమను కాటేసింది. భయపడిన సింగర్ మేతా.. వెంటనే పాములను పక్కకు నెట్టేసింది. లేచి బయటకు పరుగులు తీసింది. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోను సింగర్ మేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే 4.8లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే.. షూటింగ్ కోసం విషసర్పాలు వాడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.