బొట్టుపెడుతుండగా.. సొమ్మసిల్లి పడిపోయిన వధువు.. భయంతో వరుడు పరుగు.. వీడియో వైరల్
Scared Groom Runs Away After Bride Falls Unconscious During Sindoor Ceremony.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి
By తోట వంశీ కుమార్ Published on 20 July 2021 6:54 AM GMT
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అయితే..ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేవిగా ఉన్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోది.
ఆ వీడియోలో ఏముందంటే..? వివాహ మండపాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. బంధువుల మధ్య సిందూర్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో వరుడు.. వధువుకి బొట్టు పెట్టాల్సి ఉంటుంది. కూర్చొని ఉన్న వధువుకి తోడుగా ఇద్దరు మహిళలు ఉన్నారు. కుంకుమ పెట్టాడానికి వరుడు సిద్ధమయ్యాడు. బొట్టు పెట్టమని ప్లేటును వరుడికి ఇవ్వగా.. అతను బొట్టు తీసుకొని.. పెళ్లికూతురి నుదుటిపై పెట్టబోయాడు. అంతలోనే వధువు ఢమాల్ మని పక్కకు పడిపోయింది.
దీంతో వరుడు షాక్ కు గురయ్యాడు. పాపం.. అతనికి ఏంజరిగిందో అర్థం కాలేదు. కాసేపటికి, వధువు ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన అతను.. వెంటనే తన తలపాగను తీసిపాడేశాడు. అంతటితో ఆగకుండా కోపంతో.. మెడలోని పూలమాల తీసి నెలకేసి కొట్టాడు. భుజంపై ఉన్న కండువా కూడా తీసేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. పక్కనున్న మహిళ అతని చెయ్యి పట్టుకుని వెళ్లొద్ది బతిమాలింది. కానీ వరుడు భయపడి పోతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.