భర్తకు విడాకులిచ్చి కొడుకుతో పెళ్లి.. అతడితో ఓ బిడ్డను కూడా కనేసింది.. ఎవరికెవరు ఏమవుతారు..?
Russian woman married step son and gave birth to a baby child.కలియుగంలో వావి వరుసులు మరిచిపోతారని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.భర్తకు విడాకులిచ్చి కొడుకుతో పెళ్లి..
By తోట వంశీ కుమార్ Published on 17 Jan 2021 5:49 PM ISTకలియుగంలో వావి వరుసులు మరిచిపోతారని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చింది. కొడుకును పెళ్లి చేసుకుంది. ఆ కొడుకుతో మరో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రష్యాలో జరిగింది.
రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అప్పటికే అర్రేకు పదేళ్ల కొడుకు ఉన్నాడు. మరీనా కూడా అతడిని కొడుకులా ఎంతో ప్రేమగా చూసుకునేది. వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. అలా పదేళ్లు గడిచిపోయాయి. కొన్ని నెలల కిందట ఆ భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు. మరీనా ఒంటరిగా జీవిస్తోంది. ఇక్కడికి వరకూ బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది.
మరీనా ఇంట్లోంచి వెళ్లిపోయినప్పటినుంచి ఆమెమీద బెంగపెట్టుకన్నాడు పెంపుడు కొడుకు వ్లాడిమిర్. మెరీనాను వదిలి ఉండలేకపోయాడు. వ్లాడిమిర్‌కు 20 ఏళ్లు దాటాయి. మెరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసి విడిగా జీవిస్తున్నా తరుచుగా ఆమె ఇంటికి వెళ్లి కలుస్తుండేవాడు. వాడ్లిమిర్ తనను కలవడానికి రావడం మెరీనాకు కూడా సంతోషంగా ఉండేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఉన్నది తల్లీ కొడుకుల బంధం కాదని.. దానికి మించినది ఏదో ఉందని మెరీనా అనుకునేది. ఆమె తన మనసులో మాటను వ్లాడిమిర్‌కు చెప్పింది. అతడు కూడా సంతోషంగా అంగీకరించాడు. వారిద్దరూ పెళ్లిచేసుకున్నారు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక తండ్రి కూడా ఒకే చెప్పాడు.
ఈ జంట అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు వీరికి సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే కొడుకుతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డతో ఉన్న ఫోటోను మరియా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరిద్దరి బంధంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మాజీ భార్యభర్తలు ఇప్పుడు ఎవరికెవరు ఏమవుతారు? మాజీ భార్యను కోడలవుతుందా? కొడుకు పుట్టిన మగబిడ్డ అర్రేకు మనుమడు అవుతాడా? మాజీ భార్యకు పుట్టాడు కాబట్టి కొడుకవుతాడా? ఎవరికి ఎవరు ఏమవుతారో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.