అదృష్టం అంటే ఇత‌డితే.. తాడు తెగ‌బ‌ట్టి స‌రిపోయింది గానీ..!

Rope from truck wraps biker's neck in freak road accident in Thoothukudi.లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ వ్య‌క్తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 7:40 AM GMT
అదృష్టం అంటే ఇత‌డితే.. తాడు తెగ‌బ‌ట్టి స‌రిపోయింది గానీ..!

కొంద‌రి నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఒక్కొసారి ఎదుటి వారు ప్రాణాలు కోల్పోతుంటారు. ఓ లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ వ్య‌క్తి ద్విచ‌క్ర‌వాహ‌నం పై నుంచి పైకి ఎగిరి కింద ప‌డ్డాడు. అయితే.. అత‌డి అదృష్టం బాగుండ‌డంతో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంటం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్య‌క్తి బైక్‌పై వెలుతున్నాడు. ఏర‌ల్ ప్రాంతం దాటుతుండ‌గా త‌న‌కి ఎదురుగా ఓ లారీ వ‌స్తుంది. అత‌డు ప‌క్క‌గా వెలుతుండ‌గా ఆక‌స్మాత్తుగా లారీకి వేలాడుతున్న తాడు అత‌డి మెడ‌కు చుట్టుకుంది. దీంతో అత‌డు పైకి ఎగిరి కింద‌ప‌డ్డాడు. అదృష్ట‌వ‌శాత్తు ఆ స‌మ‌యంలో తాడు తెగిపోయింది.

కింద ప‌డిన ముత్తు స్పృహ కోల్పోయాడు. స్థానికులు అత‌డికి సాయం చేశారు. అత‌డు షాక్ నుంచి తేరుకువ‌డానికి రెండు నిమిషాలు ప‌ట్టింది. ఎలా కింద‌ప‌డ్డాడో అత‌డికి అర్థం కాలేదు. స‌మీపంలో ఉన్న సీసీ కెమెరాలు ప‌రిశీలించ‌గా అస‌లు విష‌యం తెలిసింది. తాడు తెగిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు గానీ లేదంటే ప్రాణాలు పోయేవి. దీనిపై అత‌డు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. ఏరల్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it