ఇంటికి కాపలాగా ఉంటుందని ఐదు వేలు పెట్టి మరీ శునకాన్ని కొన్నాడు. అయితే.. ఆ శునకం చేసిన పనితో దానికే ఆ యజమాని కాపలాగా ఉండాల్సి వచ్చింది. ఈ విచిత్ర పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ్ల జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే..? కొప్పళ్ల జిల్లాలోని కారటిగి పట్టణాంలో దిలీప్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇంటికి కాపలాగా ఉంటుందని ఐదు వేలు పెట్టి ఓ శునకాన్ని కొన్నాడు. ఈ నెల 12న పడుకునే ముందు తన మెడలో ఉన్న గొలుసును తీసి పక్కన పెట్టుకుని పడుకున్నాడు. ఉదయం లేచిన తరువాత చూస్తే గొలుసు కనిపించలేదు.
దీంతో ఇళ్లంతా వెతుకుతున్నాడు. ఈ సమయంలో కుక్కను కట్టేసిన స్థలంలో గొలుసు ముక్కలు పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే ఆ కుక్కను పశువుల డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ ఆపరేషన్ చేయాల్సిన పని లేదని, కుక్కను ఇంటికి తీసుకువెళ్లమని చెప్పాడు. తరువాత రోజు ఆ కుక్క మలపదార్ధంలో నాలుగైదు బంగారం ముక్కలు బయటపడ్డాయి. వాటిని ఏరుకున్నాడు. మిగిలిన ముక్కలు ఎప్పుడు బయటకు వస్తాయని ఆ కుక్కకు కాపాలా కూర్చుటుంన్నాడు దిలీప్. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.