ప్యాకెట్ ఓపెన్ చేసి.. చూడ‌కుండానే చీమ‌లు పట్టిన జీడిప‌ప్పును తిన్నారు.. వీడియో వైర‌ల్‌

People Ate Cashews Covered With Ants Without Realising.జీడీప‌ప్పులో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2022 9:22 AM IST
ప్యాకెట్ ఓపెన్ చేసి.. చూడ‌కుండానే చీమ‌లు పట్టిన జీడిప‌ప్పును తిన్నారు.. వీడియో వైర‌ల్‌

జీడీప‌ప్పులో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. పోష‌కాల‌తో పాటు రుచిగా ఉండ‌డంతో వీటిని వంట‌ల్లోనే కాకుండా మామూలుగా కూడా తింటుంటారు. ఎలా తిన్నా కానీ పోష‌కాలు శ‌రీరానికి చేరుతాయి. అయితే.. వీటికి చీమ‌ల బెడ‌ద ఎక్కువ ఉంటుంది. ఎక్క‌డ నిల్వ చేసినా స‌రే వీటిని ఉప‌యోగించే లేదా తినే ముందు ఓ సారి చూసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. చీమ‌లు ప‌ట్టిన జీడిప‌ప్పును తిన్న యువ‌కులు వాంతులు చేసుకుంటున్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ఏం ఉందంటే..?

ఓ ముగ్గురు యువ‌కులు జీడీప‌ప్పు ప్యాకెట్ ఓపెన్ చేసి పోటాపోటిగా తిన‌డం ప్రారంభించారు. ప్యాకెట్ స‌గం ఖాళీ అయ్యే వ‌ర‌కు అందులో చీమ‌లు ఉన్నాయ‌ని గుర్తించ‌లేక‌పోయారు. జీడిప‌ప్పుతో పాటు చీమ‌ల‌ను కూడా తినేశారు. చివ‌ర‌కు చీమ‌లు ఉన్నాయ‌ని గుర్తించి షాక్‌కు గురైయ్యారు. ప్యాకెట్ తెరిచి ఏముందో చూడ‌కుండానే జీడీప‌ప్పు తినేశాం. ఇలా దాదాపు ఓ నిమిషం పాటు తిన్నాం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఓ యువ‌కుడు వాంతి చేసుకోవ‌డం క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

10 మిలియ‌న్ల‌కు పైగా మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే 356,466 లైకులు రాగా.. కామెంట్ల‌కు లెక్కేలేదు. ఏం కాదు.. మేము కూడా చీమ‌ల‌ను తిన్నాం ఇని కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా.. తినేముందు కాస్త చూసుకోవాలిగా అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు పెట్టారు.

Next Story