వ్యాక్సిన్ వేసుకోకుంటే ఫోన్ కనెక్షన్ కట్.. సిమ్ కార్డ్ బ్లాక్‌

Pakistan's Punjab to block SIM cards of citizens not vaccinated.ప్ర‌పంచం మొత్తాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2021 2:35 AM GMT
వ్యాక్సిన్ వేసుకోకుంటే ఫోన్ కనెక్షన్ కట్.. సిమ్ కార్డ్ బ్లాక్‌

ప్ర‌పంచం మొత్తాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. అక్క‌డి ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయి. టీకా తీసుకుంటే బంఫ‌ర్ ఆప‌ర్లు ప్ర‌క‌టించాయి. అయిన‌ప్ప‌టికి కొంద‌రిలో మాత్రం అనుమానాలు పోవ‌డం లేదు. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ప్ర‌జ‌లు టీకాలు తీసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు.

దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్‌లు లాంటి వదంతులతో టీకాపై ప్రజలు విముఖత చూపిస్తున్నారు. మొదటి డోసు టీకా తీసుకున్నవారు చాలా మంది రెండో డోసు తీసుకోవడం లేదట. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ వదంతుల నుంచి ప్రజలు బయటపడటం లేదు. దీంతో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే టీకా వేసుకోరో వారి సిమ్ కార్డ్స్ బ్లాక్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

'ఈ పద్దతిని మొదట్లో ఒక ప్రాతిపదికగానే తీసుకున్నాం. అయితే టీకా వేసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో చట్టం చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని టెలికాం సంస్థలు నిర్ణయిస్తాయి' అని పంజాబ్ ప్రావిన్స్ ఆరోగ్యశాఖ ప్రతినిధి హమ్మద్ రజా తెలిపారు. మ‌రీ ఈ నిర్ణ‌యంతోనైనా ప్ర‌జ‌లు టీకా తీసుకుంటారో లేదో మ‌రీ

Next Story