'వ‌రుడు కావలెను' అంటూ 73ఏళ్ల బామ్మ ప్ర‌క‌ట‌న‌.. ముందుకు వ‌చ్చిన 69ఏళ్ల తాత

Old Couple Get Married.ఓ 73బామ్మ‌ ఇటీవ‌ల వ‌రుడు కావలెను అంటూ పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఇచ్చిన సంగ‌తి గుర్తుంది క‌దా. ప్ర‌క‌ట‌న చూసిన ఓ 69 ఏళ్ల ఆయ‌న ఆ బామ్మ‌తో పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2021 7:30 AM GMT
Old couple marriage

వ‌య‌సు అనేది కేవ‌లం శ‌రీరానికి మాత్ర‌మే మ‌న‌సుకు కాదంటున్నారు. జీవిత చ‌ర‌మాంకంలో ఓ తోడు కోసం ప‌రితపిస్తున్నారు. అలాంటి ఓ 73బామ్మ‌ ఇటీవ‌ల వ‌రుడు కావలెను అంటూ పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఇచ్చిన సంగ‌తి గుర్తుంది క‌దా. ఆ బామ్మ ప్ర‌క‌ట‌న చూసిన ఓ 69 ఏళ్ల ఆయ‌న ఆ బామ్మ‌తో పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు. వివ‌రాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క రాష్ట్రంలో మైసూరులో 73 ఏళ్ల రిటైర్డు ఉపాధ్యాయురాలు నివాసం ఉంటోంది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె త‌న భ‌ర్త‌కు కొన్నేళ్ల క్రిత‌మే విడాకులు ఇచ్చింది. ఒంటరిగా నివ‌సిస్తోంది.

అయితే.. జీవిత చ‌ర‌మాంకంలో ఉన్న ఆమెకు ఓ తోడు అవ‌సరం అని బావించిన ఆమె కుటుంబ స‌భ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించారు. దీంతో వ‌రుడు కావ‌లెను అనే ప్ర‌క‌ట‌న‌ను ఇచ్చారు. ఆ ప్ర‌క‌ట‌న చూసిన ఓ 69 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్‌లోనే వాళ్లిద‌రి మ‌న‌సులు క‌లిసాయి. దీంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఆమోదం తెలిపారు. కాగా.. ఆ పెద్దాయ‌న భార్య ఏడేళ్ల క్రిత‌మే అనారోగ్యంతో చ‌నిపోయింది. ఒక కుమారుడు ఉండ‌గా.. అత‌డు విదేశాల్లో ఉన్నాడు. తండ్రిని అక్కడకి రమ్మని బ్రతిమాలినా అందుకు వృద్ధుడు విముఖత వ్యక్తం చేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. అది చూడలేని కుమారుడే తండ్రికి మరో పెళ్లి చేయాలని భావించాడు. అతడి ప్రోద్బలంతోనే ఈ విశ్రాంత ఇంజినీర్ పెళ్ళికి ఒకే చెప్పారు. త్వ‌ర‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది.


Next Story