ఒడిశా రాష్ట్రంలో వింత శిశువు జన్మించింది. తల పంది ఆకారంలో.. చర్మం పొలుసులతో ఉన్న ఆ వింత శిశువును చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. బట్టకుమరా గ్రామానికి చెందిన ఓ గర్భిణికి నొప్పులు రావడంతో నగరంలోని ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో 2.40 కిలోల బరువున్న శిశువుకి ఆమె జన్మనిచ్చింది. ఆ శిశువను చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఆ శిశువు తల పంది ఆకారంలోనూ.. చర్మంపై పొలుసులు ఉండి అవి ఊడిపోతున్నట్లుగానూ కనిపిస్తోంది.
ఇలా వింత రూపంలో జన్మించిన ఆ శిశువు ఇప్పటికి బ్రతికి ఉండడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి శిశువులు జన్మించిన కాసేపటికే చనిపోతారని డాక్టర్లు చెబుతున్నారు. కాగా.. హార్లేక్విన్ ఇచ్టిహయోసిస్ అనే అరుదైన జన్యు రుగ్మత కారణంగానే.. ఇలా శిశువు జన్మించిందని వెల్లడించారు. ఇలాంటి వ్యాధి 10లక్షల మందిలో అరుదుగా ఒకరికి వస్తుందన్నారు. అటువంటి అరుదైన జన్యు రుగ్మతతో జన్మించిన శిశువుల మనుగడకు అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు