గ‌త జ‌న్మ గుర్తొచ్చింది.. భిక్షాట‌న‌కు వెళ్లాలి.. సెలవివ్వండి

MP Engineer Asked For Sunday Off to go begging.ఆరోగ్యం బాగాలేక‌పోతేనో, ఏదైన పని ఉంటేనో అధికారుల‌కు సెల‌వు కావాల‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 8:38 AM GMT
గ‌త జ‌న్మ గుర్తొచ్చింది.. భిక్షాట‌న‌కు వెళ్లాలి.. సెలవివ్వండి

ఆరోగ్యం బాగాలేక‌పోతేనో, ఏదైన పని ఉంటేనో అధికారుల‌కు సెల‌వు కావాల‌ని విన్న‌వించుకుంటాం. అయితే.. ఓ స‌బ్ ఇంజినీర్ వింత కార‌ణాల‌తో ప్ర‌తి ఆదివారం డే ఆఫ్ కావాల‌ని త‌న పై అధికారుల‌కు లీవ్ లెట‌ర్ రాశాడు. ఇందులో అత‌డు రాసిన‌ కార‌ణాలు చూసి.. విస్తుపోవ‌డం ఆ అధికారుల వంతు అయ్యింది. ప్ర‌స్తుతం ఈ ఇంజినీర్ లీవ్ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ యాద‌వ్ డిప్యూటి ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్నాడు. అత‌డు త‌న‌కు సెల‌వు కావాల‌ని కోరుతూ పై అధికారికి ఓ లేఖ రాశాడు. అందులో సార్‌.. నాకు కొద్ది రోజుల క్రితం గ‌త జ‌న్మ‌జ్ఞాప‌కాలు గ‌ర్తుకువ‌చ్చాయి. అందుకే భిక్షాట‌న చేయాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌తి ఆదివారం సెల‌వు మంజూరు చేయాల‌ని కోరుతున్నాను అని తెలిపాడు. అంతేకాదు.. త‌న‌లోని అహాన్ని చెరిపివేయ‌డానికి, త‌న జీవిత ర‌హ‌స్యాన్ని క‌నుగొన‌డానికి, ఆత్మ‌ను శోధించాలనుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇంకా ఏముందంటే.. గ‌త జ‌న్మ‌లో ప్ర‌స్తుతం ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దున్‌ ఓవైసీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ త‌న‌కు చాలా మంచి మిత్రుల‌ని చెప్పుకొచ్చాడు.

'మేమంతా మహాభారత కాలంలో స్నేహితులం. ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు. మోహన్‌ భగవత్‌ దుర్యోధనుడి మేనమామ శకుని మామ. నా గ‌త జ‌న్మ‌గురించి తెలిసాక నేను నా జీవిత ర‌హ‌స్యాన్ని తెలుసుకోవాల‌నుకుంటున్నాను. శాశ్వ‌త‌మైన ఆత్మ కోసం శోధించాల‌నుకుంటున్నాను అందుక‌నే భిక్షాటనతో పాటు మరిన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలన్నా. అందుక‌నే సెల‌వు కావాల‌ని' అని రాజ్‌కుమార్ ఆలేఖ‌లో రాశాడు.

ఈ లేఖ‌ను చ‌దివిన ఉన్న‌తాధికారులు కూడా ఫ‌న్నీగా రిప్లై ఇచ్చారు. 'ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్ గారూ..మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం' అని రిప్లై ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Next Story