మ్యాజిక్ ను చూసిన కోతి.. ఒక్కసారిగా షాక్

Monkey awestruck by zoo visitor's magic trick. మ్యాజిక్ ట్రిక్స్ అన్ని వయసుల వారిని ఆశ్చర్యపరుస్తాయి. అయితే మేజిక్ ట్రిక్‌కి కోతి ఎలా స్పందిస్తుందో ఎప్పుడైనా చూశారా..?

By అంజి  Published on  4 Feb 2022 1:45 PM GMT
మ్యాజిక్ ను చూసిన కోతి.. ఒక్కసారిగా షాక్

మ్యాజిక్ ట్రిక్స్ అన్ని వయసుల వారిని ఆశ్చర్యపరుస్తాయి. అయితే మేజిక్ ట్రిక్‌కి కోతి ఎలా స్పందిస్తుందో ఎప్పుడైనా చూశారా..? జూ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్‌ను కోతి చూసి.. అది షాకింగ్ రియాక్షన్ ను ఇచ్చింది. ఈ అమూల్యమైన రెస్పాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మాక్సిమిలియానో ​​ఇబర్రా టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. అతను మెక్సికో సిటీలోని చాపుల్‌టెపెక్ జూలో కోతి కోసం కొన్ని సింపుల్ మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ కనిపించాడు. కోతి ఉన్న ఎన్ క్లోజర్ గ్లాస్ ముందు భాగంలో కూర్చుని 'జపనీస్ మకాక్' అనే కోతి ముందు ట్రిక్స్ చేసి చూపించాడు.

ఇబర్రా ఆకును కనిపించకుండా చేయడంతో కోతి నోరు తెరిచి ఆశ్చర్య పోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇబర్రా ఆ ఆకు మళ్లీ కనిపించేలా చేయడంతో కోతి దిగ్భ్రాంతికి గురైంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి తప్పకుండా మీ మోములో చిరునవ్వు కనిపిస్తుంది.

Next Story
Share it