ఇటీవల కాలంలో సెల్‌ఫోన్లు పేలిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా ఒకరు, ఛార్జింగ్ పెడుతుండగా మరొకరు.. జేబులో పెట్టుకోగా ఇంకొకరు సెల్ ఫోన్‌లు పేలిన ఘటనలలో గాయపడడమో.. ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు చాలానే చూశాం. ఓ వ్యక్తి బ్యాగులో సెల్‌ఫోన్ పెట్టుకుని నడుచుకుంటూ వెలుతున్నాడు. అయితే.. హఠాత్తుగా ఉన్నట్లు ఉండి సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అతడను బ్యాగును పక్కన పడేశాడు. ఏం జరిగిందో అతడికి కాసేపు అర్థం కాలేదు. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చైనాలో ఓ వ్యక్తి ఓ అమ్మాయితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెలుతున్నాడు. ఇంతలో అతడి చేతిలో ఉన్న బ్యాగులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అతడు బ్యాగును తీసి కింద పడేశాడు. తీరా పేలింది ఏంటా..? అని ఆరా తీయగా.. సెల్ పోన్ పేలింది. అయితే.. బ్యాగులో మంటలు చెలరేగే ముందు అతడికి పేలుడు శబ్ధం వినిపించిందని చెప్పాడు. అది శ్యామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఫోన్. 2016లో ఆ ఫోన్‌ను అతడు కొన్నాడు. అయితే, కొన్ని రోజుల నుంచి ఫోన్ బ్యాటరీ ఇబ్బంది పెడుతుందని.. కానీ, పేలినప్పుడు ఛార్జింగ్‌లో కూడా లేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటన అంతా రోడ్డుపైన ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.