షాంపూ కారణంగా ఆగిపోయిన పెళ్లి..!
Marriage cancelled because of shampoo in Assam.షాంపూ కారణంగా పెళ్లి ఆగిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2022 10:21 AM ISTఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే పెళ్లిపీటల వరకు వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు ఎక్కువై పోతున్నాయి. వరుడికి బట్టతల ఉందని, పొట్ట ఉందని, నల్లగా ఉన్నాడని, తాగొచ్చాడని, తనకు పంపిన పెళ్లి డ్రెస్స్ నచ్చలేదని వంటి కారణాలతో పెళ్లిళ్లు నిలిచిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఓ షాంపూ కారణంగా పెళ్లి ఆగిపోయింది. అవును మీరు చదివింది నిజమే షాంపూ కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ ఘటన అస్సాంలో జరిగింది.
గౌహతికి చెందిన ఓ ఇంజినీర్‌తో బార్పెటా జిల్లా హౌలీ ప్రాంతానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. వారి ఆచారం ప్రకారం పెళ్లికి ముందు వరుడి కుటుంబం కొన్ని వస్తువులను వధువుకి పంపిస్తుంటుంది. ఇందులో భాగంగా వరుడి కుటుంబం వధువుకు కొన్ని బహుమతులు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పంపింది. అందులో తక్కువ ధర కలిగిన ఓ షాంపూ కూడా ఉంది. అది వధువుకు నచ్చలేదు.
వెంటనే ఆ యువతి వాట్సాప్‌లో అతడికి మెసేజ్ చేసింది. నీ స్థాయి ఇంతేనా అని వెటకారంగా అంది. అది చూసిన వరుడు బాగా ఫీలైయ్యాడు. అవమానంగా బావించి నీతో పెళ్లి వద్దే వద్దూ అంటూ మరో ఆరుగంటల్లో జరగాల్సిన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. వరుడి నిర్ణయంతో వధువు కుటుంబం ఒక్కసారిగా కంగుతింది. వరుడికి నచ్చజెప్పేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. అయిన్పపటికి వరుడు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటీజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. షాంపూ ఎంత పని చేసింది. పెళ్లినే క్యాన్సల్ చేయించిందని ఓ నెటీజన్ అన్నాడు.