భార్య మాట విన‌డం వ‌ల్లే.. రూ.1.5 కోట్లు గెలుచుకున్నాన‌న్న భ‌ర్త‌

Man Wins Rs 1.5 Crore Lottery After Wife Sends Him To Grocery Store.ఓ వ్య‌క్తి భార్య చెప్పిన మాట‌ను వినడం వ‌ల్లే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2022 3:31 AM GMT
భార్య మాట విన‌డం వ‌ల్లే.. రూ.1.5 కోట్లు గెలుచుకున్నాన‌న్న భ‌ర్త‌

ఓ వ్య‌క్తి భార్య చెప్పిన మాట‌ను వినడం వ‌ల్లే త‌న‌కు అదృష్టం క‌లిసి వ‌చ్చిందని చెబుతున్నాడు. లాట‌రీలో ఏకంగా రూ.1.5 కోట్లు వ‌చ్చాయ‌ని, భార్య అలా చెప్ప‌క‌పోయి ఉంటే ఇలా జ‌రిగేది కాద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నాడు.

అమెరికాలోని మిచిగ‌న్ రాష్ట్రంలో మార్క్వేట్ ప్రాంతంలో ప్రెస్టన్ మాకి (46) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇటీవ‌ల మాకీ ఆఫీసులో ఉండ‌గా అత‌డి ఫోన్‌కు ఓ మెసెజ్ వ‌చ్చింది. అత‌డి భార్య‌నే అత‌డికి మెసేజ్ చేసింది. ఇంటికి వ‌చ్చేట‌ప్పుడు కిరాణా స‌రుకులు తీసుకుర‌మ్మ‌ని ఆ మెసేజ్ సారాంశం. దీంతో మాకీ ఇంటికి వెళ్లేట‌ప్పుడు ఓ స్టోర్‌కి వెళ్లి స‌రుకులు తీసుకున్నాడు. అనంత‌రం అక్క‌డే 'మిచిగ‌న్ లాట‌రీ' కి సంబంధించి 5 టికెట్లు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిపోయాడు.

అదృష్టం అత‌డిని వ‌రించింది. దీంతో 190,736 డాల‌ర్లు(భార‌త క‌రెన్సీలో రూ.1.5కోట్లు) గెలుచుకున్నాడు. త‌న భార్య వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని ఆనందంతో గెంతులు వేస్తున్నాడు. త‌న భార్య స‌రుకులు తీసుకుర‌మ్మ‌ని చెప్ప‌క‌పోయి ఉండే తాను లాటరీ కొనుగోలు చేసేవాడిని కాద‌న్నాడు.

"కిరాణా స‌రుకులు తీసుకుర‌మ్మ‌ని నా భ‌ర్య మెసేజ్ చేయ‌డంతో ఆఫీసు ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్లేట‌ప్పుడు షాపుకు వెళ్లాను. నేను సాధారణంగా ఫాంటసీ 5ని ఆడను.. అయితే ఆ స్టోర్ దగ్గర ఉండడంతో లాటరీ టికెట్ కొనుగోలు చేశాను. త‌రువాతి రోజు ఉద‌యం కిచెన్లో ఉన్న స‌మ‌యంలో లాట‌రీ టికెట్ల‌ను మొబైల్ యాప్‌లో స్కాన్ చేశాను. నేనే జాక్‌పాట్ విన్న‌గా తెలుసుకున్నాను. ఇది అస్సలు ఊహించ‌లేదు". అని చెప్పాడు ప్రిస్టోన్ మాకీ.

లాట‌రీలో వ‌చ్చిన డ‌బ్బులో కొంత పెట్టుబ‌డుల కోసం ప‌క్క‌న బెడ‌తాన‌ని మిగిలిన మొత్తాన్ని త‌న కుటుంబం కోసం ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఓ వ్య‌క్తి సైతం ఈ విధంగానే రూ.15 కోట్లు గెలుచుకున్న‌ట్లు చెప్పాడు. స‌రుకుల కోసం షాపుకు వెళ్లి లాట‌రీ టికెట్లు కొనుగోలు చేయ‌డంతో కోట్లాది రూపాల‌య‌లు ద‌క్కిన‌ట్లు తెలిపాడు.

Next Story