భయంకరమైన పాముల మధ్యలో మనిషి.. వీడియో వైరల్
Man sits in area surrounded by several snakes.ఒకటి కాదు రెండు పదుల సంఖ్యలో పాముల మధ్యలో కూర్చొగలమా.. అదీ కూడా కొండచిలువల మధ్య. కానీ ఓ వ్యక్తి ధైర్యంగా కూర్చున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2021 5:03 AM GMT
మనలో చాలా మందికి పాముల అంటే చాలా భయం ఉండే ఉంటుంది. అలాంటిది ఒకటి కాదు రెండు పదుల సంఖ్యలో పాముల మధ్యలో కూర్చొగలమా.. అదీ కూడా కొండచిలువల మధ్య. కానీ ఓ వ్యక్తి ధైర్యంగా కూర్చున్నాడు. అది కూడా ఓ ఐదు, పది నిమిషాలు కాదండోయ్.. ఏకంగా గంటకు పైనే. అదీ కూడా ఏదో సింహనం మీద కూర్చున్నట్లు హాయిగా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అక్వాలేడీ ఖాతా పేరుతో పేరుతో ట్విట్టర్‌లో ఓ యూజర్ ఈ వీడియోను పోస్టు చేశారు. 12 సెకన్ల నిడివి గల ఆవీడియోలో ఏం ఉందంటే.. చుట్టూ కొండచిలువలు ఉన్నాయి. మధ్యలో ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనిపై అవి పాకుతూ వెళ్లాయి. కొన్ని సర్పాలైతే ఏకంగా అతనిపై పడ్డాయి. అయినప్పటికీ ఆ పాములు అతనికి ఎలాంటి హానీ కలిగించలేదు. పాముల మధ్యలో కూర్చొన్న ఆ వ్యక్తి ఎవరు..? ఎందుకు అక్కడ కూర్చున్నాడు..? అనే విషయాలు అయితే తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 24 గంటల్లో 3లక్షల మంది పైగా దీనిని వీక్షించారు. 50 మిలియన్ డాలర్ల కోసమైనా ఒక గంట ఉండగలరా..? అని ఆ వీడియోకి క్వాప్షన్ పెట్టారు.
CAN YOU SPEND 1 HOUR INSIDE HERE FOR 50 MILLION DOLLARS??? pic.twitter.com/WP8Rt4rT6W
— Aqualady𓃤 𓅇 𓅋 𓆘 (@Aqualady6666) February 3, 2021
ఇక దీనిపై నెటీజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. అవి విషరహిత సర్పాటు అయి ఉండొచ్చునని అందుకనే ఆయన అలా ధైర్యంగా కూర్చొగలిగాడని.. తాము కూడా ఇలా చేసేందుకు సిద్దమని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ఆ వీడియో చూసేయండి.