పండ‌గ పూట భ‌ర్త‌ను చిత‌క‌బాదిన భార్య‌.. గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో షాపింగ్ వెళ్తే అంతేగా

Man shopping with girlfriend on Karwa Chauth beaten up by wife in Ghaziabad.పండుగ పూట భ‌ర్త‌ను భార్య ఎందుకు కొట్టిందో చూద్దాం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2022 6:22 AM GMT
పండ‌గ పూట భ‌ర్త‌ను చిత‌క‌బాదిన భార్య‌.. గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో షాపింగ్ వెళ్తే అంతేగా

క‌ర్వా చౌత్‌.. ఈ పండుగను ఎక్కువగా ఉత్తర, ఈశాన్య భారతంలో ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. భ‌ర్త ఆరోగ్యంగా ఉండాల‌ని రోజంతా ఉప‌వాసం ఉండి, చీక‌టి ప‌డిన త‌రువాత ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. అలాంటి రోజున భ‌ర్త‌ను భార్య చిత‌క‌బాదింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పండుగ పూట భ‌ర్త‌ను భార్య ఎందుకు కొట్టిందో చూద్దాం..

ఇటీవ‌ల భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డిన భార్య త‌న పుట్టింటికి వెళ్లింది. నిన్న‌(గురువారం) క‌ర్వాచౌత్ కావ‌డంతో త‌న త‌ల్లితో క‌లిసి ఆమె షాపింగ్‌కు వెళ్లింది. అక్క‌డ క‌న‌ప‌డిన దృశ్యం చూసి ఆమె ఆగ్ర‌హంతో ఊగిపోయింది. త‌న భ‌ర్త.. గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి షాపింగ్ చేస్తుండ‌డాన్ని చూసింది. ఇంకేముందు వెంట‌నే భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్లి కాల‌ర్ ప‌ట్టుకుని స్నేహితుల సాయంతో దాడి చేసింది. ఆ స‌మ‌యంలో ఆ వ్య‌క్తి గ‌ర్ల్‌ఫ్రెండ్ అత‌డిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అక్క‌డ ఉన్న మిగ‌తా ఆడవాళ్లు ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఘజియాబాద్‌ మార్కెట్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో షాపింగ్ వెళ్తే అట్లానే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story