భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతి మరుపు
Man loses memory after having Romance with his wife.శృంగారం.. ఒత్తిడిని తగ్గిస్తుందని, దంపతుల మధ్య సఖ్యత
By తోట వంశీ కుమార్ Published on 29 May 2022 8:14 AM ISTశృంగారం.. ఒత్తిడిని తగ్గిస్తుందని, దంపతుల మధ్య సఖ్యత పెంచుతుందని, అనేక వ్యాధులను రాకుండా చేస్తుందని పలువురు వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. శృంగారంలో పాల్గొన్న ఓ వ్యక్తి పది నిమిషాలకే గజినిగా మారిపోయాడు. ముందు రోజు జరిగిన విషయాలను అన్ని అతడు మరిచిపోయాడు. ముందు రోజు ఏం జరిగిందని భార్య, పిల్లలను పదే పదే అడగడం మొదలుపెట్టాడు. వాళ్లు జరిగిన విషయాలను అన్నీ పూస గుచ్చినట్లు చెప్పినప్పటికీ అతడి ఏమీ గుర్తు రాలేదు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. తన పేరు, పాత విషయాలు మాత్రం అతడికి గుర్తు ఉండడం గమనార్హం. ఈ ఘటన ఐర్లాండ్ దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. 66 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తరువాత 10 నిమిషాలకు తన మొబైల్ ఫోన్‌లో ఆ రోజు తేదీ చూసి షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే ముందు రోజు అతడి పెళ్లి రోజు. ఇంత ముఖ్యమైన విషయాన్ని తాను ఎలా మరిచిపోయాను అంటూ బాధపడసాగాడు. అయితే.. ముందు రోజు సాయంత్రం తన భార్య, కుమారైతో కలిసి పెళ్లి రోజును అతడు చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదే విషయాన్ని వారిద్దరూ అతడికి చెబుతున్నప్పటికీ అతడికి ఏమీ గుర్తు లేదు.
ఒక వేళ మీరు చెప్పిందే నిజం అయితే ఏమీ జరిగిందో వివరంగా చెప్పాలని వారిని అతడు కోరారు. వారిద్దరూ ఆ రోజు సాయంత్రం ఏమీ ఏమీ చేశారో అన్నీ వివరంగా పలు మార్లు చెప్పారు. అయినప్పటికీ అతడి అందులో ఒక చిన్న విషయం కూడా గుర్తుకు రావడం లేదు. అయితే.. అతడు అన్ని విషయాలు మరిచిపోయాడా అంటే అదీ లేదు. తన పేరు, వయస్సు, పాత విషయాలను అన్నీ చెప్పేస్తున్నాడు.
అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. దీన్ని స్వల్పకాలిక మతిమరుపుగా వైద్యులు తెలిపారు. వైద్య పరిభాషలో దీన్ని ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా(టీజీఏ) అంటారని చెప్పారు. సాధారణంగా ఇది 50 నుంచి 70 ఏళ్ల మధ్య వారిపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా ప్రచురితమైంది. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సదరు వ్యక్తి ఇలా ఒక రోజును మరిచిపోవడం ఇదే కొత్తకాదట. 2015లో కూడా అతడికి ఇదే విధంగా జరిగిందట. ఆ సమయంలో అతడు భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే ఇలా జరిగిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.