సెల్‌ఫోన్‌లో భార్య చేసిన చిలిపి ప‌ని.. విడాకులు ఇచ్చిన భ‌ర్త‌

Man divorces wife after she records mother-in-law snoring.ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న కార‌ణాల‌తో దంప‌తులు విడిపోతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 11:53 AM IST
సెల్‌ఫోన్‌లో భార్య చేసిన చిలిపి ప‌ని.. విడాకులు ఇచ్చిన భ‌ర్త‌

ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న కార‌ణాల‌తో దంప‌తులు విడిపోతున్నారు. క‌లిసి ఉండ‌డానికి కార‌ణాలు వెతుకోవాల్సింది పోయి.. చాలా చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను సైతం భూత‌ద్దంతో చూస్తూ.. త‌మ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్నారు. అత్త గారి గుర‌కను రికార్డు చేసిన ఓ భార్య‌.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టింది. ఇంకేముంది ఈ కార‌ణంగా దంప‌తులు విడిపోయారు. విన‌డానికి కాస్త వింత‌గా ఉన్న ఉన్నా.. ఇది నిజంగా నిజం. ఈ ఘ‌ట‌న జోర్డాన్ దేశంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. జోర్డాన్ దేశానికి చెందిన ఓ వక్తికి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. త‌న భార్య‌, త‌ల్లితో క‌లిసి ఆనందంగా జీవిస్తున్నాడు. అయితే.. అత్త‌గారు నిద్ర‌పోయేట‌ప్పుడు గుర‌క పెట్టేది. ప‌క్క గ‌దిలో నిద్రిస్తున్న కోడ‌లికి ఇది ఇబ్బంది క‌లిగించేది. అయితే.. ఓ రోజు స‌ర‌దాకి అత్త‌గారు నిద్ర పోతున్న స‌మ‌యంలో ఆమె గుర‌కను కోడ‌లు రికార్డు చేసింది. ఆ రికార్డింగ్‌ను త‌మ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టింది. అది చూసిన బంధులు అత్త‌గారిని హేళ‌న చేయ‌డం మొదలుపెట్టారు.

దీంతో ఈ విష‌యంపై దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభం అయ్యాయి. స‌ర‌దాగా చేసాన‌ని చెప్పినా.. అత‌డు విన‌లేదు. చిన్న గొడ‌వ కాస్త చిలికి చిలికి గాలి వాన‌లా మారింది. భార్య స‌ర‌దాగా ఆ ప‌ని చేసిన‌ప్ప‌టికి త‌మ ప‌రువు పోయింద‌ని ఆ భ‌ర్త ఆగ్ర‌హించాడు. ఈ కార‌ణంతోనే భార్య‌కు విడాకులు ఇచ్చేశాడు. ఇటీవ‌ల కాలంలో జోర్డార్ దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story