డెలివరీ డేట్ దగ్గరకి వచ్చింది. అసలే తన గర్భంలో 7 గురు ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఆసుపత్రి లో చేరింది హలీమా సిస్సే అనే 25 ఏళ్ల మహిళ.. అయితే డాక్టర్స్ తో పాటూ ఆమె కూడా ఆశ్చర్యపడేలా ఏకంగా తొమ్మిదిమంది శిశువులకు జన్మనిచ్చింది. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో జరిగింది.
గర్భిణిగా పరీక్షల కోసం ఈ ఏడాది మార్చిలో ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలో ఏడుగురు పెరుగుతున్నట్టు గురించారు. ప్రసవ సమయంలో నిపుణుల పర్యవేక్షణ అవసరమని చెప్పి మొరాకోలోని ఆసుపత్రికి తరలించారు. తాజాగా అక్కడామె ప్రసవించింది.
మొత్తం తొమ్మిదిమందికి ఆమె జన్మనివ్వగా వారిలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మాలి ఆరోగ్య మంత్రి ఫంటా సిబీ తెలిపారు. మొరాకోకు మాలిలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఏడుగురు శిశువులే ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే, సిజేరియన్ సమయంలో మరో ఇద్దరు కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి జననాల్లో శిశువుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఒకేసారి పుడితే ట్విన్స్, ముగ్గురు అయితే ట్రిప్లెట్.. అదే తొమ్మిది మంది అయితే… ఎక్కువ ఆలోచించకండి.. నానుప్లేట్స్ లేదా నాన్యుప్లేట్స్ అంటారు..