సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు సెలవు కోసమో.. ఇంకా దేనికొరకైనా పై అధికారుల అనుమతి కోరుతుంటారు. కానీ ఇక్కడ ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసుకున్న ద‌రఖాస్తు అందరిని ఆశ్యర్యపరుస్తోంది. కోవిడ్‌ కారణంగా మహారాష్ట్రలో కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలో ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానం మహారాష్ట్ర ఉంది. ఇక కోవిడ్‌ కారణంగా మళ్లీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఇంకా వర్క్‌ప్రమ్ హోం చేయిస్తున్నా. ఇక కొందరు ఉద్యోగాలు బైక్‌లపైన, రైళ్లు, ఇతర వాహనాల్లో వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సతీష్‌ అనే ఓ ఉద్యోగి వింత అనుమతిని కోరాడు. తాను పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టులో కార్యాలయానికి రావాలంటే భయం వేస్తోందని, ప్రభుత్వం అనుమతి ఇస్తే రోజూ గుర్రంపై ఆఫీస్‌కు వెళ్లి వస్తానని కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు.

ఇలా ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయానికి గుర్రంపై రావడమనే సంస్ఖృతి దేశంలో ఎక్కడా లేదు. అందువల్ల అనుమతి ఇవ్వడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇక విషయం ఏంటంటే కార్యాలయంకు గుర్రంపై వస్తే దానిని ఎక్కడ ఉంచాలి. దాని బాగోగులు ఎవరు చూస్తారు.. దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి, ఇది ఎవరికైనా హాని కలిగిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ ఉద్యోగి ఎవరు..?

ఈ వింత కోరిక కోరిన ఉద్యోగి పేరు సతీష్‌ పంజాబ్‌. నాందేడ్‌ కలెక్టరేట్‌లో గ్యారెంటీ స్కీమ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తనకు గుర్రంపై కార్యాలయానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చాడు. అయితే దీనికి ఎలా స్పందించాలో కలెక్టర్‌కు ఏ మాత్రం అర్థం కాలేదు అయితే గుర్రంపైనే ఎందుకు రావాలనుకుంటున్నాడో కారణం కూడా చెప్పుకొచ్చాడు ఉద్యోగి సతీష్‌.

తాను బైక్‌పై కార్యాలయానికి వస్తే గతుకుల రోడ్ల వల్ల తన నడుం విరిగిపోతోందని, ఒళ్లు నొప్పులు ఎక్కువై పోతున్నాయి. రకరకాల సమస్యలు వస్తున్నాయని, పోనీ కారు కొనుక్కుందామంటే అంత స్థోమత తనకు లేదు అని అన్నారు. అందుకే అనుమతి ఇస్తే తాను గుర్రం కొనుక్కుని రోజు గుర్రంపై ఆఫీసుకు వస్తానని విన్నవించాడు. తాజాగా ఈ అంశంపై మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.


సామ్రాట్

Next Story