ప్రేమ వివాహం చేసుకున్న కూతురు.. మేక‌కు సీమంతం చేసిన త‌ల్లిదండ్రులు

Karnataka couple made baby sowers to a goat.కన్నకూతురి మాదిరిగా పెంచుకున్న ఓ మేకకు సీమంతం చేయ‌డంతో ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలిచారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2021 10:04 AM GMT
Karnataka couple made baby sowers to a goat

క‌న్న‌బిడ్డ‌ల‌ను తల్లిదండ్రులు ఎంత‌గానో ప్రేమిస్తారు. అలాంటిది పిల్ల‌లు వారికి దూరం అయితే.. వారు ఎంత‌లా విల‌విల‌లాడుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుర్లు ఉన్నారు. పెద్ద కుమారై.. త‌ల్లిదండ్రుల్ని కాద‌ని ప్రేమ వివాహం చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు త‌మ‌ను వ‌దిలివేసి వెళ్లిపోవడంతో ఆ దంప‌తులు చాలా బాధ‌ప‌డ్డారు. త‌న బిడ్డ జ్ఞాపకార్థంగా ఓ మేక‌ను సాధుకుంటున్నారు. కన్నకూతురి మాదిరిగా పెంచుకున్న ఓ మేకకు సీమంతం చేయ‌డంతో ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలిచారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది.

వివరాల్లోకి వెళ్తే.. చిత్ర దుర్గ జిల్లా నన్నివాల గ్రామానికి చెందిన రాజు, గీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రంజిత తల్లిదండ్రుల ను కాదని ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కుమార్తె తమ మాట కాదని పెళ్లి చేసుకోవడం తో ఆ దంప‌తులు ఓ జింక‌ను పెంచుకున్నారు. అయితే.. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు అడ్డురావ‌డంతో దాన్ని అడవిలో వ‌దిలిపెట్టారు. ఎంతో ప్రేమ‌గా పెంచుకున్న జింక‌ను అడ‌విలో వ‌దిలిపెట్టిన త‌రువాత ఆ కుటుంబం మాన‌సికంగా ఎంతో కుంగిపోయింది. ఆ వేద‌న నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఓ మేక‌ను పెంచుకుంటున్నారు. దాన్ని త‌మ పెద్ద బిడ్డ‌గా బావించారు. ఆ మేక గ‌ర్భం దాల్చ‌డంతో దానికి సీమంతం చేయాల‌ని నిర్ణ‌యించారు.

మేక సీమంతానికి తమ బంధువులందరినీ ఆహ్వానించారు. ఆడ బిడ్డకు నిర్వహించే సీమంతం వేడుకకు ఏమాత్రం తీసిపోని విధంగా మేక సీమంతం జరిపారు. ఆ మూగ జీవం పై రాజు-గీత దంపతులు చూపించిన అనుబంధాన్ని చూసి ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోయారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కొంద‌రు వీరి చేసిన ప‌నినిన మెచ్చుకోగా.. మ‌రికొంద‌రు మాత్రం ఎంటో ఈ కలియుగం మాయ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటీజ‌న్లు.
Next Story