మాస్క్‌ను ఇలా కూడా వాడొచ్చా.. బాబోయ్ అరాచ‌కం.. వీడియో వైర‌ల్‌

How to Re use mask funny video goes viral.క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచాన్ని వ‌ణికించింది. ఈ మ‌హ‌మ్మారి నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2021 12:19 PM IST
మాస్క్‌ను ఇలా కూడా వాడొచ్చా.. బాబోయ్ అరాచ‌కం.. వీడియో వైర‌ల్‌

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచాన్ని వ‌ణికించింది. ఈ మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోవాలంటే.. ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించ‌డంతో పాటు శానిటైజ‌ర్ రాసుకోవ‌డం, భౌతిక దూరం పాటించ‌డం త‌ప్ప‌ని స‌రి. అయితే.. మాస్కుల‌ను ఓ సారి మాత్ర‌మే వాడి ప‌డేస్తుంటాం. అయితే.. కొంద‌రు వాటిని పాడేయ‌డానికి మ‌న‌సు ఒప్ప‌క‌.. వాటిని వాష్ చేసి ర‌క‌ర‌కాలుగా ఉప‌యోగిస్తున్నారు. వీరి వాడ‌కం చూస్తుంటే.. బాబోయ్ అనాల్సిందే. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది.

ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశాడు. వాడ‌కం అంటే ఇది. ఇండియాలో మాత్ర‌మే ఇలా సాధ్యం అని ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఆ వీడియోలో ఏం ఉందంటే..? కొందరు మాస్కులను నీటిని వడపోయటానికి ఉపయోగిస్తే.. మరికొందరు తమ పిల్లలకు డైపర్లుగా వినియోగిస్తున్నారు. ఇక జడ కొప్పుగా, పూల కుండీగా, చాయ్ వడపోసే జాలి గా, కాలికి సాక్స్‌లా, పక్షులకు ఊయలలా, ఎండ తగలకుండా టోపీలా, మోచేతికి ర‌క్ష‌ణ‌గా ఇలా ఒకటేమిటి.. మాస్క్‌ని ఇన్నిర‌కాలుగా వినియోగించ‌వ‌చ్చా అన్న విధంగా వినియోగిస్తున్నారు. మ‌న‌సు ఉండాలే గాని మార్గం ఉంటుంది, కాదేది క‌ళ‌ల‌కు అన‌ర్హం అన్న చందంగా ఉప‌యోగిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి ఆ వీడియోపై లుక్కేయండి.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అరే ఈ విష‌యం తెలియ‌క ఇన్నాళ్లు చాలా మాస్కుల‌ను ప‌డేసానే..? మ‌న‌కు మ‌న‌మే సాటి మ‌న‌కు లేరు ఎవ‌రు పోటి..? అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story