సాధారణంగా ఎవరైనా వాంతి చేసుకున్నట్లు తెలిసిన ఒకవేళ చూసిన మనకి కూడా వాంతులు రావడం సహజమే. కానీ ఈ వాంతి గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు మన ఇంట్లో కక్కిన బాగుండు అనిపిస్తుంది. ఇంతకీ ఆ వాంతిలో ఏంటి? అందులో ఏమివిశేషం ఉంది అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురించి పూర్తి తెలుసుకోవాల్సిందే. అసలు విషయం తెలిస్తే మన ఇంట్లో వాంతి చేసుకున్న బాగుండు అనిపిస్తుంది...
ఈ మధ్యకాలంలో థాయిలాండ్ బీచ్ సమీపంలో ఇసుకలో ఏదో ఒక తెల్లటి ముద్దలాగా పడి ఉండటం ఓ మత్స్యకారుడి కంటపడింది. ముందుగా దానిని చూసి ఏదో ఒక రాయి అని భావించాడు. కానీ దగ్గరకు వెళితేదానిని చూడగానే ఇదేదో పనికొచ్చే వస్తువు లాగా ఉందని భావించి దానిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. దానిని తీసుకొని ఊర్లో ఉన్న పెద్ద వాళ్లకు చూపిస్తే అసలు విషయం బయటపడింది.
ఆ మత్స్యకారుడి దొరికింది ఒక రాయి కాదు అది ఒక తిమింగలం వాంతి.. సాధారణంగా తిమింగలాలు వాంతి చేసినప్పుడు అవి నీటిపై తేలియాడుతూ ఉంటాయి. లేదా సముద్ర తీరానికి కొట్టుకు వస్తుంటాయి. తిమింగలాలు ఫ్రెష్ గా వాంతి చేసుకున్నప్పుడు భరించలేని కంపు కొడుతుంది. రానురాను ఈ వాంతి మెత్తగా ముద్దులాగా తయారవడం వల్ల ఇందులో నుంచి సుగంధ పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. తిమింగలాల వాంతిని ప్రముఖ పర్ఫ్యూమ్ కంపెనీలు పర్ఫ్యూమ్ తయారుచేయడానికి ఉపయోగిస్థాయి. అందుకే ఈ తిమింగలం వాంతి కోట్లలో ధర పలుకుతుంది. ప్రస్తుతం ఈ మత్స్యకారుడి దొరికిన తిమింగలం వాంతి ధర రూ.2.09 కోట్లు మాత్రమే.. గతంలో ఇలాంటి తిమింగళం వాంతి ధర దాదాపు 22 కోట్ల రూపాయలకు అమ్మడు పోయిందట. ప్రస్తుతం ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆ వాంతి ఏదో మనకు దొరికిన బాగుండేది అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.