వింతకేసు.. పెళ్లామే కావాలన్న 16ఏళ్ల బాలుడు
High Court Refuses To Give Custody Of Minor Husband To Wife.అప్పుడప్పుడు కొన్ని వింత వింత కేసులు కోర్టు ముందుకు
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2021 3:57 AM GMTఅప్పుడప్పుడు కొన్ని వింత వింత కేసులు కోర్టు ముందుకు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ కేసు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ముందుకు వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిని తమ సంరక్షణలో ఉండేలా అనుమతించాలని కోరుతూ బాలుడి తల్లి, బాలుడి భార్య ఇద్దరూ కోర్టుకు వచ్చారు. బాలుడు మైనర్ కాబట్టి తల్లితో వెళ్లమంటే.. కాదు భార్యతోనే వెళ్తానని పట్టుబట్టాడు. చట్ట ప్రకారం అది కుదరదు కాబట్టి మైనార్టీ తీరేంత వరకు బాలుడ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని షెల్టర్ హోం కు తరలించింది కోర్టు.
వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్ లోని అజంగఢ్ లో నివసించే మైనర్ బాలుడు తన కంటే పెద్దదైన యువతితో సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి తన కొడుకును తన వద్దకు పంపించాలని కోరుతూ గతేడాది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్18, 2020 ఈ కేసు కోర్టుకు రాగా.. న్యామూర్తి బాలుడి అభిప్రాయాన్ని రికార్డు చేశాడు. మైనర్ బాలుడు తన భార్యతో బలవంతంగా ఉంటున్నట్లు చెప్పలేదు. ఇష్టపడే సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.తనకు పెళ్లామే కావాలని ఆ బాలుడు మొండిపట్టు పట్టాడు. తల్లితో వెళ్లేందుకు నిరాకరించాడు.
ఈ ఏడాది మే 31 న కోర్టు తీర్పు వెలువరిస్తూ.. మైనర్ బాలుడు మేజర్ యువతితో సహజీవనం చేస్తే ఫోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది. దీనికి పరిష్కారం చూపుతూ బాలుడికి మైనార్టీ తీరేదాకా అంటే..2022 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెలర్డ్ హోంకు తరలించాలని కోర్టు తీర్పు చెప్పింది. మైనార్టీ తీరాక అతడు తన ఇష్టం ప్రకారం ఎవరితోనైనా ఉండవచ్చునని కూడా స్పష్టం చేసింది. తీర్పు కాపీలను అలహాబాద్ హై కోర్టు సోమవారం (జూన్ 14న) వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది.