మనిషిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో అసలు ఊహించలేము.. ఎందుకంటే టర్నింగ్ పాయింట్ అన్నది ఏ ఏజ్ లో అయినా సరే రావచ్చు. మనం ప్రయత్నించకపోవడమే చేస్తున్న పెద్ద తప్పు అని స్ఫష్టంగా తెలుస్తుంది. అలా తన తప్పు తెలుసుకున్న మోడల్‌ దినేష్‌ మోహన్ ఛేంజ్ ఓవర్ కోసం చేసిన కష్టం తాజాగా బయటకు వచ్చింది. దినేష్‌ మోహన్ తన 50వ ఏట 50 కేజీల బరువు తగ్గి మోడలింగ్‌ రంగంలోను రాణిస్తున్నాడు. రజనీకాంత్‌, షారుఖ్‌ వంటి స్టార్‌లతో సినిమాలలో నటించాడు. హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబెతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా దినేష్ చాలా విషయాలను బయటపెట్టాడు.

దినేష్‌ మోహన్‌ లైఫ్ లో కూడా ఒక్కసారిగా ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆరోగ్య సమస్యలతో 44 ఏళ్ల వయస్సులో 130 కేజీల బరువు పెరిగిపోయాడు. అక్క, బావ డాక్టర్‌లు, సైకియాట్రిస్ట్‌ యార్టిక్స్‌లకు చూపించారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒక సంవత్సరంపాటు ఇంట్లోనే మంచానికే అంకిత మయ్యాడు. నువ్వు ఇలా కృంగిపోవడం మాకు నచ్చడం లేదని.. ఒకరోజు కుటుంబ సభ్యులందరు దినేష్‌ దగ్గరికి వెళ్ళి కంటతడి పెట్టుకున్నారు.

దినేష్‌ తాను మారాలని నిర్ణయించుకుని డైటిషియన్‌ను సంప్రదించాడు. అతని సూచనల మేరకు ఆహర నియమాలు పాటించాడు. కొన్ని రోజులకు తన చుట్టు పక్కల వారితో కలవడం ప్రారంభించాడు. క్రమంగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగై, బరువు 50 కేజీలు తగ్గింది. వర్కవుట్స్‌ బాగా చేస్తుండడం కూడా కలిసొచ్చింది. బాగా బరువు తగ్గిపోయాడు. కొన్నిరోజుల తర్వాత సోషల్‌ మీడియాలో బరువు తగ్గడంలో వచ్చిన మార్పుకు సంబంధించిన తన ఫోటోని పోస్ట్‌ చేశాడు. అది తెగ వైరల్‌ అయిపోయింది. మీరు యువతకు ఎంతో ఆదర్శం, గొప్ప పనులకు వయస్సు అడ్డుకాదనడానికి మీరే మా స్ఫూర్తీ ప్రదాత అని కామెంట్లు చేశారు. ప్రస్తుతం దినేష్ మోహన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మారిపోవాలి అని కోరుకునే వారికి వయసు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదు అని దినేష్ మోహన్ నిరూపించాడు.


సామ్రాట్

Next Story