తనను తానే వివాహం చేసుకుంటానని చెప్పిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల క్షమాబిందు ఆ ఘట్టాన్ని పూర్తి చేసింది. వేద మంత్రాల సాక్షిగా, బాజాభజంత్రీల నడుమ, ఆత్మీయుల సమక్షంలో స్వీయ వివాహం చేసుకుంది. పెళ్లిలో భాగంగా జరిగే అన్ని వేడుకల్ని ఆమె నిర్వహించింది. ముందుగా తాను అనుకున్నట్లుగానే ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే.. మూహుర్తాని కన్నా రెండు రోజుల ముందే పెళ్లి తంతును ముగించేసింది.
వాస్తవానికి జూన్ 11న గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే.. ఆమె వివాహం వివాదాస్పదంగా మారింది. క్షమా పెళ్లిని అడ్డుకుంటామని కొందరు హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా వివాహం చేసుకుంది.
వరుడు లేకుండానే సంప్రదాయ ప్రకారం అన్ని వేడుకలు చేసుకుంది. క్షమా, హల్దీ, మెహందీ కార్యక్రమాలతో పాటు పెళ్లిలో వేద మంత్రాలు, ఏడడుగులు కూడా నడిచింది. తనకు తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.