య‌జ‌మాని ప్రేమ‌.. ఆవుల‌కు బంగారు ఆభ‌ర‌ణాలు.. గులాబీ పూల వ‌ర్షం

Gujarat man made jewelry for his cow. ఇంట్లో పెంచుకునే ఆవుల‌ను మహాలక్ష్మీలా పూజించే సంస్కారం మ‌న దేశంలో ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 1:41 PM IST
య‌జ‌మాని ప్రేమ‌.. ఆవుల‌కు బంగారు ఆభ‌ర‌ణాలు.. గులాబీ పూల వ‌ర్షం

ఇంట్లో పెంచుకునే ఆవుల‌ను మహాలక్ష్మీలా పూజించే సంస్కారం మ‌న దేశంలో ఉంది. అయితే.. ఎంత‌గా పూజించిన‌ప్ప‌టికి ఆవుల‌కు బంగారు ఆభ‌ర‌ణాలు వేయ‌డం ఎప్పుడైనా చూశారా..? అయితే.. ఓ ఆవు య‌జ‌యాని ఏకంగా బంగారు. వెండి ఆభ‌ర‌ణాలు చేయించి ఆవుల మెడ‌లో వేసి వాటిపై త‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటుకున్నాడు. అనంత‌రం ఆవుల‌పై పూల వ‌ర్షం కురిపించాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

వివ‌రాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన విజ‌య్ ప్ర‌సన్నాకు ఓ ఆవు, దూడ ఉంది. వాటిని ఎంతో ప్రేమ‌గా చూసుకునేవాడు. వాటికి బంగారు న‌గ‌లు చేయించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. వెంట‌నే ఏబీ జ్యువెల‌ర్స్ య‌జ‌మాని మ‌నోజ్ సోనిని సంప్ర‌దించాడు. అత‌ను ఆవుల‌కు ఆభ‌రణాలు చేసేందుకు అంగీక‌రించాడు. అనంత‌రం ఆవును, దూడ‌ను జ్యూవెల‌ర్స్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఓ గ‌దిని పూల‌తో అలంక‌రించి.. ఆవు, దూడ‌కు బంగారు ఆభ‌రణాలు ధ‌రింప‌చేశారు. వాటికి ప్రూట్స్‌, స్వీట్లు పెట్టారు. అనంతరం వాటిపై గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.




Next Story