వెల్‌కం టూ వెడ్డింగ్స్ 21 : మండ‌పంలో ల్యాప్‌టాప్‌తో వ‌రుడు.. వీడియో వైర‌ల్‌

Groom sits on the mandap with his laptop.క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని గ‌త ఏడాదిన్న‌ర‌గా వ‌ర్క్ ఫ్రం హోం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 2:19 PM IST
వెల్‌కం టూ వెడ్డింగ్స్ 21 : మండ‌పంలో ల్యాప్‌టాప్‌తో వ‌రుడు.. వీడియో వైర‌ల్‌

క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని గ‌త ఏడాదిన్న‌ర‌గా వ‌ర్క్ ఫ్రం హోం జీవితాల్లో భాగ‌మైంది. అయితే.. ఇంట్లో ఉంటూ ప‌ని చేయ‌డం కొంచెం క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికి చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఓ ప‌క్క ఇంట్లో ప‌నుల‌ను చ‌క్క‌బెడుతూనే మ‌రోప‌క్క ఆఫీసు వ‌ర్క్‌ను చేసేస్తున్నారు. ప‌ని ఒత్తిడి కూడా తెలియ‌డం లేదంటున్నారు కొంద‌రు టెకీలు.

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగి ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ పెళ్లికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోలో పెండ్లి మండ‌పంలోనే పెళ్లికొడుకు ల్యాప్‌టాప్‌తో కుస్తీప‌డుతున్నాడు. ఓ ప‌క్క పెళ్లి తంతు జ‌రుగుతుండ‌గా.. మ‌రో ప‌క్క వ‌రుడు త‌న‌కు అర్జెంట్ మీటింగ్ ఉందంటూ ల్యాప్ టాప్‌తో పుల్ బిజీగా ఉన్నాడు. ల్యాప్‌టాప్‌తో ప‌నిచేసుకుంటున్న పెళ్లికొడుకు కెమెరా కంటికి చిక్క‌గా.. కొంచెం దూరంగా పెండ్లికూతురు న‌వ్వుతూ సోఫాలో కూర్చున్న దృశ్యాలు వీడియోలో క‌నిపించాయి. ఈ వీడియో దుల్హానియా అనే నెటిజ‌న్ 'వెల్‌కం టూ వెడ్డింగ్స్ 21' అనే క్యాప్ష‌న్ ఇచ్చిపోస్టు చేసింది.

దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు వ‌ర్క్ ఫ్రం వెడ్డింగ్స్ అంటూ కొత్త ట్రెండ్ ప్రారంభ‌మైందా ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. పెళ్లి రోజు క‌నీసం సెల‌వు అయినా తీసుకో బ్రో, తన పెళ్లి వేడుక‌నూ అత‌డు ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నాడ‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఏదీఎమైన‌ప్ప‌టికి ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.




Next Story