పెళ్లి అనేది వరుడు, వధువు మధ్య ఆడంబరంగా జరిగే వేడుక. కానీ ఒకే కల్యాణ మండపంలో ఒక వరుడు, ఇద్దరు వధువుల పెళ్లి జరిగింది. ఇద్దరు వధువులు, ఒకేసారి, ఒకే ముహూర్తానికి, ఒకే వేదికపై తాళి కట్టించుకున్నారు. అది మరెక్కడో కాదు చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని తిక్రాలొహంగా గ్రామంలో. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల్లోకి వెళితే.. బస్తర్ జిల్లా జగదల్పూర్ సమీపంలోని తిక్రాలోహంగా అనే గ్రామానికి చెందిన చందు మౌర్య అనే యువకుడు హసీనా (19) సుందరి(21) అనే ఇద్దరు యువతుల మెడలో ఒకేసారి తాళికట్టాడు. ఈ ఇద్దరూ యువతులు ఇంటర్ వరకు చదివారు.
గతంలో ఈ యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకునే విషయం వచ్చేసరికి ఎవరిని వదులుకోలేకపోయాడు. అందుకని ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి ఒప్పించి ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి గ్రామ పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ఘా మారాయి. ఇది తమ ఆచారమని గిరిజన పెద్దలు చెప్పడం ఇక్కడ కొసమెరుపు.