మనిషి ముఖంతో పుట్టిన మేక.. చూసేందుకు ఎగ‌బ‌డిన జ‌నం.. ప‌ది నిమిషాల‌కే..

Goat gave birth to half human baby in gujarat. తాజాగా ఓ మేక మ‌నిషి ముఖంతో ఉన్న పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. చూడ‌డానికి ఆ మేక పిల్ల స‌గం మ‌నిషి.. స‌గం మేక‌గా ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2021 4:34 AM GMT
goat birth with human face

ఈ ప్ర‌పంచంలో నిత్యం ఏదో ఒక చోట వింత‌లు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే.. వాటిలో మ‌న‌కు తెలిసేవి కొన్ని మాత్ర‌మే. తాజాగా ఓ మేక మ‌నిషి ముఖంతో ఉన్న పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. చూడ‌డానికి ఆ మేక పిల్ల స‌గం మ‌నిషి.. స‌గం మేక‌గా ఉంది. ఈ వింత జీవి గురించి గ్రామ‌స్తులకు తెలియ‌డంతో దానిని చూడ‌డానికి తండోప‌తండాలుగా విచ్చేశారు. కొద్ది మంది దానికి పూజ‌లు కూడా చేశారు. అయితే.. ఆ మేక పిల్ల ఎంతో సేపు బ్ర‌త‌క‌లేదు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. సోనాఘ‌డ్ తాలూకా సెల్టిపేట గ్రామంలో అజ‌య్ భాయ్ వాస‌వ అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు.


ఆయ‌న మేక‌ల‌ను పెంచుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. కాగా.. తాజాగా ఓ మేక ప్ర‌స‌వించింది. అయితే.. ఆ మేక పిల్ల చూడ‌డానికి అచ్చం మ‌నిషి ముఖం పోలి ఉంది. మామూలుగా మేకకు తోక ఉంటుంది. అయితే.. దీనికి తోక లేదు. సగం మ‌నిషి.. స‌గం మేక పోలిక‌ల‌తో జ‌న్మించిన ఆ వింత జీవిని చూసేందుకు గ్రామ‌స్తులు అత‌డి ఇంటికి క్యూ క‌ట్టారు. దేవుడి ప్ర‌తిరూపం అంటూ కొంద‌రు పూజ‌లు కూడా చేశారు. అయితే.. ఈ వింత మేక పిల్ల ప‌ది నిమిషాలు మాత్ర‌మే బ‌తికి ఉంది. ప్ర‌స్తుతం ఈ వింత మేక పిల్ల ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


Next Story