భారత్ లో డైరీ ప్రాడక్ట్ లెక్కల ప్రకారం ప్రపంచ దేశాలకంటే భారత్ లో 13శాతం పాల ఉత్పత్తి జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 75లక్షల డైరీ ఫామ్స్ ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లే క్రితం పాల వ్యాపారం కాల్విటీ లేకపోవడం, తక్కువ ఉత్పత్తులతో ఒడిదుడుకులు ఎదుర్కొంది. తాజాగా పాల బిజినెస్ కోసం ఏకంగా హెలికాప్టర్ కొన్నాడో రైతు. రూ.30 కోట్లు పెట్టి మరీ దాన్ని కొనుగోలు చేశాడు. సాధారణంగా రైతులు ట్రాక్టార్, జెబిసి వంటివి కొనుగోలు చేస్తుంటారు.. అయితే తాను అందరికంటే భిన్నం అంటూ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఏకంగా విమానాన్ని కొనేసాడు.


మహారాష్ట్రలోని భీవండికి చెందిన జనార్దన్ బోయర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. అయితే ఇటీవల డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. పాల వ్యాపారం కోసం నేను దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాను. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్.. ఇలా తిరుగుతుంటాను. అయితే చాలా ప్రాంతాలకు ఎయిర్ పోర్టు లో సౌలభ్యం లేదు. ఇక కారు, బస్సు, రైలులో వెళ్లాలంటే గంటలకొద్దీ టైమ్ పడుతోంది. అందుకే ఫ్రెండ్ సలహా మేరకు హెలికాప్టర్ కొన్నాను అని చెప్పాడు జనార్దన్.

అయితే మార్చి 15న హెలికాప్టర్ డెలివరీ ఇస్తారని.. 2.5 ఎకరాల్లో హెలిప్యాడ్, హెలికాప్టర్ గ్యారేజ్, పైలట్, టెక్నీషియన్ రూమ్స్ నిర్మిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రస్తుతం జనార్థన్ కి రూ.100 కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. భీవండిలో గోదాములు ఉన్నాయి. వాటికి వచ్చే కిరాయి ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఈ పాల వ్యాపారి హెలికాప్టర్ కొనుగోలు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


సామ్రాట్

Next Story