వావ్ ఆ ఊరిలో అందరూ కౌబాయ్స్..!
Everyone in the Village Rides on Horse like Cowboys. కౌబాయ్ అనగానే హాలీవుడ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అయితే ఏపీ లో దాయర్తి కూడా అలాంటి గ్రామమే
By Medi Samrat
కౌబోయ్ సినిమాను తలపించేలా గ్రామంలో ప్రతి ఒక్కరూ గుర్రాన్ని పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు. రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. దాయర్తి కూడా అలాంటి గ్రామమే. దాయర్తికి విద్యుత్ సౌకర్యం కూడా లేదు. కొండపై నుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్లే ఏ పనికైనా గుర్రాలనే నమ్ముకోవాలి. బాహ్య ప్రపంచంతో సంబంధాల కోసం ఈ గుర్రాలే గిరిజనులకు ఆధారం. ఇక్కడి వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ రికార్డుల్లో దాయర్తి గ్రామం వందకుపైగా ఏళ్ల నుంచే ఉంది. అప్పట్లో కేవలం 10 నివాసాలు మాత్రమే ఉంటే... ఇప్పుడవి వందకు చేరాయి.
ఇందులో సగం మందికి గుర్రాలు ఉన్నాయని దాదాపు అవి 50 వరకు ఉన్నాయని అంటున్నారు. గుర్రాలను పోషించడమంటే కష్టమైన పనే. వాటి ఆహారం, ఆరోగ్యం, ఆలనాపాలనా చూడటం ప్రయాసతో కూడుకున్నదే. మా పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయ ఆస్తిగా భావిస్తూ వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కిల్లంకోట, బలపం, గాలికొండ, దుప్పిలవాడ, ఎర్రచెరువులు, మొండిగెడ్డ, రంగబయలు గ్రామ పంచాయితీలలో కూడా గుర్రాలున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఇక్కడి పరిస్థితులు వారికి గుర్రాలతో సహవాసం కలిగేలా చేశాయని అంటున్నారు.