ఇటీవల జంతువులు దారి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. కారణం ఏమైనప్పటికి తరుచుగా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. కొన్ని ప్రాణాలతో క్షేమంగా తిరిగి అడవిలోకి వెలుతుండగా.. మరికొన్నింటిని మాత్రం కుక్కలు, కొందరు మనుషులు వేటాడుతూ వాటి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఓ ఏనుగు దారి తప్పింది. చీకటిలో ఏమీ కనిపించగా 15లోతున ఉన్న పాడుబడిన బావిలో పడింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. డ్యూలి ఫారెస్ట్ రేంజ్ ఆపీసర్ రబీ నారాయణ్ మొహంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మయూరభంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ ఏనుగుల గుంపు అటుగా వెలుతోంది. రాత్రి సమయం కావడంతో అందులో ఓ ఏనుగు పిల్ల దారి తప్పింది. ఏమీ కనిపించకపోవడంతో ఆ ఏనుగు పిల్ల 15 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడింది. శనివారం ఉదయం అటుగా వెలుతున్నవారికి ఏనుగు పిల్ల అరుపులు వినిపించాయి. వారి బావిలోకి తొంగి చూడగా అక్కడ ఏనుగు కనిపించింది. దీంతో వారు వెంటనే ఫారెస్టు అధికారుకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు జేసీబీ సాయంతో బావి పక్కగా మట్టిని తొలగించి.. ఆ ఏనుగు పిల్లను తాళ్ల సాయంతో బయటకు లాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.