రిపోర్టింగ్ చేసే సమయంలో విలేకరులకు ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పించేవిగా కూడా ఉంటాయి. తాజాగా ఓ లేడీ రిపోర్టర్ ను ఊహించని విధంగా ఓ కుక్క బాగా ఇబ్బంది పెట్టింది. ఎంతగా అంటే ఆమె చేతిలో నుండి మైక్ లాక్కుని వెళ్లిపోయేటంతలా..! ఇక ఆ మైక్ తీసుకోకపోతే తన ఉద్యోగం ఊడిపోతుందని అనుకుందో ఏమో కానీ.. వెంటపడి ఆఖరికి ఆ కుక్క నోటి నుండి మైక్ ను లాక్కుంది.

రష్యా రాజధాని మాస్కోలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి వాతావరణంపై రిపోర్టర్ నాదెజ్దా సెరెజ్కినా తన వివరణను ఇస్తూ ఉంది. అప్పుడే న్యూస్ రూమ్ నుంచి యాంకర్ ఓ ప్రశ్న అడగ్గా నాదెజ్దా సెరెజ్కినా లైవ్ లో రిపోర్టింగ్ ఇస్తుండగా.. గోల్డెన్ రిట్రీవర్ కుక్క... ఒక్కసారిగా ఆమెపైకి ఉరికి ఆమె చేతిలోని మైక్‌ని నోటితో కరచుకుంది. కుక్క మీదకు రావడంతో కంగారు పడిన ఆమె మైక్‌ని గట్టిగా లాక్కోలేకపోయింది. నోటికి మైక్ చిక్కడంతో దాన్ని కుక్క పట్టుకొని వెళ్లిపోయింది. మైకు కోసం ఆమె కుక్క వెంట పరుగులు పెట్టింది. దాంతో లైవ్ పోయింది. ఇదంతా చూసిన యాంకర్‌, కెమెరామేన్‌ షాకయ్యారు. కుక్క నుంచి మైక్‌ని ఎలాగోలా తిరిగి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని కోటి మందికి పైగా చూశారు. ఏది ఏమైనా ఆ కుక్క-ఆ యాంకర్ కాస్తా సెలెబ్రిటీలు అయిపోయారు.సామ్రాట్

Next Story