డెలివ‌రీ బాయ్‌ని క‌రిచిన కుక్క‌.. పాపం ఎక్క‌డ గాయ‌ప‌రిచిందంటే..!

Dog bites Zomato delivery boy private part.మహారాష్ట్రలో పెంపుడు కుక్క దాడికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Sept 2022 12:46 PM IST
డెలివ‌రీ బాయ్‌ని క‌రిచిన కుక్క‌.. పాపం ఎక్క‌డ గాయ‌ప‌రిచిందంటే..!

మహారాష్ట్రలో పెంపుడు కుక్క దాడికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. డెలివరీ బాయ్‌పై కుక్క దాడి చేసింది. జోమాటో డెలివ‌రి బాయ్ లిఫ్ట్‌లోంచి బ‌య‌ట‌కు రాగానే క‌రిచింది. ఆగ‌స్టు 29న ఈ ఘ‌ట‌న జ‌రుగ‌గా.. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. న‌రేంద్ర పెరియార్ అనే వ్య‌క్తి జొమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆగ‌స్టు 29న పన్వెల్‌లోని ఇండియాబుల్స్ గ్రీన్స్ మేరిగోల్డ్ అపార్ట్‌మెంట్‌లో డెలివ‌రీ ఇచ్చేందుకు వెళ్లాడు. ఓ ప్లాట్‌లో డెలివ‌రీ ఇచ్చిన అనంత‌రం లిఫ్ట్‌లో కింద‌కు వ‌చ్చాడు. అయితే.. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయ‌గా జర్మన్ షెపర్డ్ క‌నిపించింది. దీంతో అత‌డు జాగ్ర‌త్త‌గా కుక్క‌ను త‌ప్పిచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు కుక్క అక‌స్మాత్తుగా దాడి చేసింది. అత‌డి ప్రైవేటు పార్టును క‌రిచిన‌ట్లు వీడియోలో క‌నిపిస్తోంది.

అత‌డికి తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో గ‌ట్టిగా అరిచాడు. సాయం కోసం వెంట‌నే పార్కింగ్ ప్లేస్‌లోకి వ‌చ్చాడు. స్థానికులు అత‌డిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు అత‌డికి చికిత్స అందిస్తున్నారు. రేబిస్ ఇంజ‌క్ష‌న్ ఇవ్వ‌డంతో పాటు కుక్క క‌రిచిన ప్రైవేటు ప్రాంతంలో కుట్లు కూడా వేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. అత‌డి వైద్యానికి అవుతున్న ఖ‌ర్చును ఆ పెంపుడు శున‌కం య‌జ‌మాని భ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

Next Story