సాధార‌ణంగా పేప‌ర్ల‌లో కానీ, వెబ్‌సైట్ల‌లోగానీ వధువు కావలెను అనో 'వరుడు కావలెను' అనో ప్రకటనలు ఇవ్వడం మ‌నం చూస్తూనే ఉన్నాం. అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎక్కడైనా ప్రకటన ఇవ్వడం చూశారా..? అందులోనూ తన అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఓ కోడలు ఇచ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రెండు రోజులు తన అత్తకు బాయ్ ఫ్రెండ్ లా ఉంటే డబ్బులు కూడా ఇస్తానంటూ ఆమె ప్రకటించడం విశేషం. ఒంట‌రిగా ఉన్న త‌న అత్త కోసం కోడ‌లు చేస్తున్న ప్ర‌య‌త్నంపై నెటీజ‌న్లు ట్రోల్ చేస్తూ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఓ కోడలు తన 51ఏళ్ల అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చింది. రెండు రోజులపాటు అతను తన అత్త తో కాస్త సమయం గడిపి.. ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావాలని అందులో ఉంది. బాయ్ ఫ్రెండ్ వయసు 40-60 మధ్యలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. అలా ఉన్నవారికి 960డాలర్లు(మ‌న క‌రెన్సీలో సుమారు రూ.72వేలు) ఇస్తానని తెలిపింది. బాయ్ ఫ్రెండ్ గా వచ్చేవారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు బాగా డ్యాన్స్ చేయడం కూడా వచ్చి ఉండాలని ఆమె షరతు పెట్టడం గమనార్హం. ప్ర‌స్తుతం ఈ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story