ప‌ర్వ‌తం మ‌ట్టిలో బంగారం.. ఎగ‌బ‌డ్డ జ‌నం.. వీడియో వైర‌ల్‌

Congo gold mountain.దక్షిణ కివు ప్రావిన్స్‌లో ఓ ప‌ర్వ‌తంపై బంగారం ఉన్న‌ట్లు తెలిసింది. ఇంకేముందు అక్క‌డి స్థానికులు వెంట‌నే దాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2021 7:38 AM GMT
Congo gold mountain

ఓ ప‌ర్వ‌తంపై బంగారం ఉన్న‌ట్లు తెలిసింది. ఇంకేముందు అక్క‌డి స్థానికులు వెంట‌నే దాని వ‌ద్ద‌కు చేరుకున్నారు. త‌మ‌కు దొరికిన వ‌స్తువుల‌తో ఆ ప‌ర్వ‌తాన్ని త‌వ్వుతున్నారు. కొంద‌రు ఆ మ‌ట్టిని క‌డుగుతూ ఉండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం మ‌ట్టిని సంచుల్లో నింపుకుని ఇంటికి తీసుకువెలుతున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

దక్షిణ వివు ప్రావిన్స్‌ లుహిహిలోని ఓ పర్వతం పై ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..మట్టిలో 60 నుంచి 90 శాతం బంగారం ఉన్న‌ట్లు తెలిసింది. ఇంకేముంది ఈ విష‌యం ఆనోట ఈ నోట ప్ర‌జ‌లకు తెలిసింది. దీంతో ఆ ప‌ర్వ‌తం చుట్టుప్ర‌క్క‌ల ఉన్న స్థానికులు ఆ ప‌ర్వ‌తం మీద‌కు ఎగ‌బ‌డ్డారు. కొండ‌పై తవ్వుతూ బంగారాన్ని వెతుకుతూ, బంగారంపై ఉన్న మ‌ట్టిని క‌డుగుతూ స్థానికులు క‌న‌ప‌డ్డారు. బంగారంలా క‌న‌ప‌డిన ప్ర‌తి రాయినీ సంచుల్లో నింపుకుని వెళ్లారు.


ఆ మట్టిని చాలా మంది ఇంటికి తీసుకెళ్లి క‌డుక్కోగా.. మ‌రి కొంద‌రు అక్క‌డే దాన్ని శుభ్రం చేసి త‌మ‌కు క‌డుక్కున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ అహ్మద్‌ అల్గోభరి ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇక కొండ‌పై బంగారం విష‌యం తెలుసుకున్న ఆదేశ మైనింగ్ శాఖ దీనిపై స్పందించింది. ఆ కొండపై బంగారాన్ని తవ్వ‌డాన్ని నిషేదించింది.


Next Story