కొన్ని కొన్ని సార్లు ఊహించని రీతిలో టిప్ అందుకుంటూ ఉంటారు కొందరు. సర్వ్ చేస్తూ ఉన్న వారికి ఏదో ఒకరకమైన ఆనందాన్ని ఇద్దామని భావించే కస్టమర్లు పెద్ద ఎత్తున టిప్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ భారీ టిప్ ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అది కూడా 9 లక్షలకు పైగానే..! యూఎస్ లోని న్యూయార్క్ లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి ఓ కస్టమర్ ఏకంగా 13 వేల డాలర్లు (దాదాపు రూ. 9.42 లక్షలు) టిప్ గా ఇచ్చారు.

న్యూయార్క్ లో లిల్లీస్ కాక్ టైల్ రెస్టారెంట్ పేరిట ఓ హోటల్ ఉంది. అక్కడ ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్ గా పని చేస్తోంది. ఆ హోటల్ కు తరచుగా కమెడియన్ రాబిన్ స్కాల్ వెళుతూ ఉంటారు. ఆమెను చూసి, ఆమెకేదైనా సాయం చేయాలని భావించారు.

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పి, ఎంతో కొంత సాయం చేయాలని కోరారు. ఆ డబ్బు ఆమెకు ఇద్దామని చెప్పారు.. తాను ఆమెకు డబ్బులు ఇచ్చి సాయపడతానని..ఈ పోస్ట్ పెట్టే సమయంలో ఓ 1000 డాలర్ల నిధిని సేకరించి, ఆమెకు ఇచ్చినా తనకు సంతోషమేనని రాబిన్ భావించారు. కానీ నిమిషాల వ్యవధిలోనే 13 వేల డాలర్లు పోగయ్యాయి. దీంతో ఆ డబ్బును తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లిన రాబిన్ స్కాల్, ఆమెకు మొత్తం తాను సేకరించిన మొత్తాన్ని టిప్ గా ఇచ్చి వచ్చారు. తొలుత ఆమె షాక్ తింది.. ఆ షాక్ నుండి తేరుకుని స్కాల్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపింది. సహాయం చేసిన ఫాలోవర్లకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.


సామ్రాట్

Next Story