పిల్ల‌లు చేసిన ప్ర‌యోగం.. కొద్దిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది

Close shave for five kids in manhole fire.దీపావ‌ళి పండుగ అంటే చిన్నారుల‌కు ఎంతో ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ట‌పాకాయ‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2021 6:09 AM GMT
పిల్ల‌లు చేసిన ప్ర‌యోగం.. కొద్దిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది

దీపావ‌ళి పండుగ అంటే చిన్నారుల‌కు ఎంతో ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ట‌పాకాయ‌లు కాలుస్తూ చిన్నారులు సంబ‌రాలు చేసుకుంటుంటారు. అయితే.. ట‌పాసులు కాల్చేస‌మ‌యంలో చిన్నారుల‌ను ఓ కంట క‌నిపెట్టాలి లేదంటే.. ప్ర‌మాదాలు త‌ప్ప‌దు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోనే అందుకు నిద‌ర్శ‌నం. దీపావ‌ళి ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఐదుగురు చిన్నారులు ట‌పాసుల్లో ఉండే భాస్వ‌రాన్ని ఓ కాగితంపై పోసి.. దాన్ని మ్యాన్‌హోల్‌పై ఉంచి నిప్పంటించారు. అంతే క్ష‌ణాల్లో మంట‌లు ఎగిసిపడ్డాయి. చిన్నారులు చేసిన ప‌ని పెద్ద ప్ర‌మాదాన్నే తెచ్చిపెట్టింది. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. సూర‌త్ ప‌ట్ట‌ణంలోని యోగి చౌక్ ప్రాంతంలోని తుల‌సి ద‌ర్శ‌న్ సొసైటీలో కొంద‌రు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఐదుగురు చిన్నారులు ట‌పాసుల్లో ఉండే భాస్వ‌రాన్ని కాగితంపై పోసి రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్‌పై ఉంచి నిప్పంటించారు. వెంట‌నే మ్యాన్ హోల్ నుంచి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. క్ష‌ణాల్లో అప్ర‌మ‌త్తం అయిన చిన్నారులు ప‌క్క‌కు ప‌రుగులు తీశారు. దీంతో ప్ర‌మాదం త‌ప్పింది. అయితే.. మంట‌లు ఆగ‌లేదు.

ఓ వ్య‌క్తి గిన్నెతో నీళ్లు పోసిన‌ప్ప‌ట‌కి మంట‌లు ఎగిసిప‌డుతూనే ఉన్నాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డకు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. మ్యాన్‌హోల్ కిందుగా వ్యంట‌గ్యాస్ పైప్ లైన్ ఉంద‌ని.. అందుకే మంట‌లు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చిన్నారులు ట‌పాసులు కాల్చేట‌ప్పుడు ఓ కంట క‌నిపెడుతుండాల‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో చిన్నారులు స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

Next Story