ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సోమ‌వారం నాడు బాగ్‌పత్‌ మార్కెట్‌లో జ‌రిగిన ఓ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్కెట్‌లో చాట్ దుకాణదారుల మధ్య చోటుచేసుకున్న చిన్న‌ గొడ‌వ‌.. కర్రలతో ఇరువ‌ర్గాలు కొట్టుకునే ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ఈ గొడ‌వ‌కు సంబంధించిన ఓ వీడియో రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే గొడ‌వ జ‌రుగుతున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. వివాదానికి కార‌ణ‌మైన అంద‌రిని పోలీసుస్టేష‌న్‌కు తీసుకెళ్లారు.అయితే.. ఈ గొడవల్లో తలదూర్చిన ఓ ముస‌లాయ‌న‌.. తన విచిత్రమైన‌ హెయిర్ స్టయిల్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. దీంతో చాచా ట్రెండ్ క్రియేట్ అయ్యింది. నెటిజన్లు చాచాను శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తో పోలుస్తున్నారు. అలాగే.. గొడ‌వకు సంబంధించిన‌ వీడియోను చూసిన ఓ నెటిజ‌న్‌.. ఈ ఫైర్ సినిమాగా కొద్దిరోజుల్లో మీముందుకు వ‌స్త‌ది అని కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియోను బాలీవుడ్ నటి రుచా చడ్డా షేర్ చేస్తూ.. నేరం జరిగినట్టు చూపిస్తే.. జ‌నాలు తప్పుపడతారు. అదే వాస్తవ దృశ్యాలు చూపించినప్పుడు కూడా అదే విధంగా స్పందిస్తార‌ని.. ఇలా చాలా విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయని రాసుకొచ్చింది.


సామ్రాట్

Next Story