రుచి చూడండి.. డ‌బ్బులు సంపాదించండి..!

Candy company now hiring full-time 'candyologists'. క్యాండి ఫన్‌హౌస్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. క్యాండీ, చాక్లెట్‌ టేస్ట్‌ టెస్టర్‌ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోండి

By Medi Samrat  Published on  24 Jan 2021 12:20 PM IST
candyologists

ఈ భూమ్మిద‌ పొట్టకూ‌టి కోస‌మే ప్ర‌తి జీవి పోరాటం. అందుకు మ‌నుషులేమి అతితులు కారు. కూటి కొర‌కు కోటి విద్య‌లు అని అనాదిగా చ‌దువుకుంటూ వ‌స్తున్నాం. అయితే.. ఆ కూటి కోసం ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించేవారినే చూస్తూ వ‌చ్చాం. కానీ తింటేనే డ‌బ్బులొచ్చే ఉద్యోగాన్ని గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎక్క‌డో మ‌చ్చో.. ఎంతో అదృష్టమో ఉంటే గానీ.. అలాంటి రుచికరమైన ఉద్యోగం దొరకదు. అలా తింటూ డబ్బు సంపాదించే అవకాశం మీకు వస్తే వదులుకుంటారా? ముమ్మాటికి వ‌ద‌ల‌రు క‌దా.!

అయితే వెంటనే కెనడాకు చెందిన ప్ర‌ముఖ‌ క్యాండీల తయారీ కంపెనీ.. క్యాండి ఫన్‌హౌస్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. క్యాండీ, చాక్లెట్‌ టేస్ట్‌ టెస్టర్‌ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 15వ తేదీ చివరి తేది. గ‌డ‌వులోపే మీరు మీ దరఖాస్తును పంపించేయండి.

క్యాండి ఫన్‌హౌస్ కంపెనీ తాము తయారు చేసే పదార్ధాలను రుచి చూసే ఉద్యోగుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. అంతేకాదు.. గంటకు దాదాపు రూ.‌ 1700 రూపాయలు(30 కెనడియన్‌ డాలర్లు) ఇస్తామని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇక ఈ అరుదైన‌ ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిందల్లా ఒక‌టే. సెల‌క్టైన ఉద్యోగి ఆ కంపెనీ తయారు చేసే 3,000 క్యాండీలు, చాక్లెట్లను రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పాలి.


Next Story