శోభనం గది చూసి వ‌ధువు ప్ర‌శ్న‌.. మాములుగా లేదు.. వీడియో వైర‌ల్

Bride's reaction on seeing bed covered with flowers.మ‌నం సోష‌ల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏం జ‌రిగినా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2021 6:58 AM GMT
శోభనం గది చూసి వ‌ధువు ప్ర‌శ్న‌.. మాములుగా లేదు.. వీడియో వైర‌ల్

మ‌నం సోష‌ల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారుతున్నాయి. వీటిలో కొన్ని చూడటానికి ఫ‌న్నీగా ఉంటే.. మ‌రికొన్ని ఆశ్చ‌ర్యం క‌లిగించేలా.. మ‌రికొన్ని బాధ‌ను క‌లిగేలా ఉంటున్నాయి. ఇటీవ‌ల పెళ్లికి సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చెక్క‌ర్లు కొడుతోంది. ఓ పెళ్లి కూతురు పెళ్లి అయిన తర్వాత శోభనం గదిలోకి వెళ్లి అక్కడ ఒక ప్రశ్న అడిగింది. దీంతో ఆ సంఘటనకు సంబంధించి ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. శోభనం గదిలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఓ పెళ్లి వేడుకకు చాలా మంది అతిథులు వచ్చారు. పెళ్లి వేడుక పూర్తైనది. వధూవరులను ఆశీర్వదించిన బంధవులు ఇంటికి పయనమయ్యారు. అంతా అనుకున్నట్లే జరిగింది. ఆ రాత్రికి జరగాల్సిన కార్యానికి అంతా సిద్దం చేశారు. గది మొత్తం అందంగా తయారుచేసి ఉంచారు. మొత్తం బెడ్ అంతా వివిధ రకాల పూలతో, కలర్ ఫుల్ గా అలంకరించారు. ఇక శోభనం గదిలోకి వెళ్లిన పెళ్లి కూతురు ఆ గది మొత్తం చూసి షాక్ అవుతుంది. మంచం నిండా పూలు ఉండ‌డంతో ''సోయెంగే కహా పె( మనం ఎక్కడ నిద్రపోవాలి)'' అని అడుగుతుంది. ఇది విన్న బంధువులు తెగ న‌వ్వుకున్నారు. దీనిపై నెటిజన్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఎక్కడ జ‌రిగిందో తెలీదు కానీ.. దుల్హనియా అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.

Next Story