బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి.. పెళ్లి రోజే పరారైన వధువు.. వెతికిపెట్టాలని సీఎంకు విజ్ఞప్తి

ఫ్రెండ్స్‌తో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి వధువు పరారైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలు పోలేదు.

By అంజి  Published on  10 May 2023 4:00 AM GMT
bride,beauty parlor, Uttar Pradesh, CM Yogi

బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి.. పెళ్లి రోజే పరారైన వధువు.. వెతికిపెట్టాలని సీఎంకు విజ్ఞప్తి

పెళ్లి పనులు అన్ని పూర్తయ్యాయి. బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ పెళ్లి వేదిక దగ్గరకు ఒక్కొకరుగా చేరుకుంటున్నారు. మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా.. అసలైన ట్విస్ట్‌ ఇచ్చింది వధువు. ఫ్రెండ్స్‌తో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి వధువు పరారైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలు పోలేదు. పెళ్లి సమయంలో పారిపోవడంతో పరువు పోతుందేమోనన్న భయంతో తమ కూతురి కోసం నగరం అంతటా గాలించారు. తెలిసిన వారికి ఫోన్‌ చేసి కూతురి గురించి ఆరా తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

లక్నోలోని ఏరియా సెక్టార్‌కు చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 5వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. ఇంట్లో వారు పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి రోజు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పిన వధువు.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. వధువు ఎంతకూ తిరిగి ఇళ్లు చేరలేదు. చాలా సేపటి తర్వాత వధువు కోసం నగరంలో గాలించారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులు గడుస్తున్నా వధువు ఆచూకీ తెలియరాలేదు. దీంతో తమ కూతురి ఆచూకీ వెతికి పెట్టాలని కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story