తొలిరాత్రి వ‌రుడికి షాకింగ్ నిజాన్ని చెప్పిన వ‌ధువు.. అత‌డి ఫ్యూజులు ఔట్‌

Bride discloses shocking truth to groom on wedding night.భార్య తొలి రాత్రి భ‌ర్త‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Nov 2022 10:12 AM IST
తొలిరాత్రి వ‌రుడికి షాకింగ్ నిజాన్ని చెప్పిన వ‌ధువు.. అత‌డి ఫ్యూజులు ఔట్‌

ఎన్నో ఆశ‌ల‌తో పెళ్లి చేసుకున్నాడు. జీవిత భాగ‌స్వామితో కొత్త జీవితంపై ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. ఇక ఇన్నాళ్లుగా తాను ఎంత గానో ఎదురుచూస్తున్న తొలి రేయి రానే వ‌చ్చింది. భార్య తొలి రాత్రి భ‌ర్త‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. పెళ్లి ప‌నుల్లో అల‌సిపోయి ఉంటుంద‌ని అత‌డు భావించాడు. రెండవ‌ రోజు కూడా ఇదే తంతు జ‌రిగింది. దీంతో అత‌డికి అనుమానం వ‌చ్చింది. గ‌ట్టిగా అడితే స‌రికి అస‌లు నిజం చెప్పింది. అది విని అత‌డు షాక్‌కు గురి కాగా.. ఈ విష‌యం తెలియ‌గానే కుటుంబంలో అల‌జ‌డి రేగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఈటాలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తొలి రాత్రి శారీర‌క సంబంధానికి అత‌డి భార్య నిరాక‌రించింది. పెళ్లి ప‌నుల వ‌ల్ల ఆమె అల‌సిపోయి ఉంటుంద‌ని అత‌డు బావించాడు. ఇక రెండ‌వ రోజు కూడా ఆమె నిరాక‌రించింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న వింత‌గా ఉండ‌డంతో కాస్త గ‌ట్టిగానే నిల‌దీశాడు. దీంతో అస‌లు నిజం చెప్పింది. తాను లింగ‌మార్పిడి చేయించుకున్న‌ట్లు తెలిపింది.

ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులు దాచి పెళ్లి చేసిన‌ట్లు చెప్పింది. ఇది విన్న అత‌డు షాక్‌కు గురి అయ్యాడు. ఆమెను పుట్టింటికి పంపించి వేశాడు. త‌రువాత కొద్ది రోజుల‌కు వ‌ధువు త‌రుపు బంధువులు వ‌రుడి ఇంటికివ‌చ్చి క‌ట్నం, డ‌బ్బు, న‌గ‌ల‌ను తీసుకువెళ్లారు. పెళ్లి ఖ‌ర్చుల‌ను ఇవ్వాల‌ని వ‌రుడు అడుగ‌గా అత‌డిపై వ‌ధువు కుటుంబీకులు దాడి చేశారు.

వ‌ధువు త‌ల్లిదండ్రుల‌పై వ‌రుడు జైతర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story